ఈసారి అధికారంలోకి వస్తే రైతుల పెట్టుబడి పథకం పదివేలకు పెంచుతామని, పింఛను రెండువేల పదహారు రూపాయలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. పాలకుర్తి సభలో ఆయన ప్రసంగిచారు. వికలాంగులకు మూడువేల పదహారు రూపాయల నెలవారీ పింఛను ఇస్తామన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రతి పేదవాడికీ నిర్మించి ఇస్తామని చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుత పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇళ్ల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్ రావు గోదావరి జలాలు తెచ్చారని, ఈఎన్నికల్లో ఎర్రబెల్లిని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉంటుందన్న గ్యారంటీ లేదన్నారు. ఇరవై నాలుగుగంటలూ కరెంట్ ఇచ్చిన ఘటన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడైనా చూశారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.