సుహాసిని సంగతేంటి?

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సూటిగా ప్రశ్నించారు. హరికృష్ణ చనిపోక [more]

Update: 2018-12-29 13:06 GMT

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సూటిగా ప్రశ్నించారు. హరికృష్ణ చనిపోక ముందు ఆ కుటుంబం గురించి బాబు పట్టించుకోలేదని, హరికృష్ణ చనిపోయిన వెంటనే సింపతీని క్యాష్ చేసుకుందామని ఇంట్లో ఉన్న మనిషిని రాజకీయాల్లోకి లాగిన నీచ రాజకీయనాయకుడు చంద్రబాబు అని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శవాలపై పేలాలు ఏరుకునే వాడిలా రాజకీయాలు చేయడంలో దిట్ట అని విమర్శంచారు. సుహాసినిని పోటీకి దింపి ఓడిపోయిన తర్వాత పట్టించుకోలేదన్నారు. ఇప్పుడేమన్నా హరికృష్ణ బిడ్డకు ఏమైనా చేస్తావా? అని సూటిగా ప్రశ్నించారు.

Tags:    

Similar News