నేడు నల్లగొండ జిల్లాకు కేసీఆర్… సాగర్ ఉప ఎన్నికకు?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ సిద్ధమయింది. నేడు హాలియాలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. హాలియాలో దాదాపు లక్షల మందితో బహిరంగ [more]

;

Update: 2021-02-10 01:44 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ సిద్ధమయింది. నేడు హాలియాలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. హాలియాలో దాదాపు లక్షల మందితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించకపోయినా ప్రచారాన్ని కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ ముందుగానే ప్రచారం ప్రారంభిచాలని నిర్ణయించారు. హాలియా సభ కోసం టీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News