మరోసారి ఏపీకి కేసీఆర్..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. విశాఖపట్నంలోని శారదా పీఠంలో వార్షికోత్సవాలకు రావాల్సిందిగా ఆయనను స్వరూపానందేంద్ర స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 14న శారదా పీఠంలో [more]

Update: 2019-01-30 10:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. విశాఖపట్నంలోని శారదా పీఠంలో వార్షికోత్సవాలకు రావాల్సిందిగా ఆయనను స్వరూపానందేంద్ర స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 14న శారదా పీఠంలో జరుగనున్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ వైజాగ్ వెళ్లి శారదా పీఠంలో పూజలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, ఫిబ్రవరి 14నే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అమరావతిలో గృహప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి వెళ్లి ఫెడరల్ ఫ్రంట్ అంశమై జగన్ తో చర్చిస్తానని చెప్పిన కేసీఆర్.. అమరావతికి కూడా వెళ్లి జగన్ ను కలుస్తారో లేదో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News