KCR Strategies : మూడో టర్మ్ అధికారం కోసం 8 ఎత్తుగడలు ఏమై ఉండొచ్చు.. ఒక అంచనా..!

తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో అసంతృప్తి తారా స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో అధికార పార్టీకి తిరిగి గద్దెను దక్కించుకోవడం ఎలా అనేది యక్ష ప్రశ్నగా మారింది.

Update: 2023-10-16 06:14 GMT


తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో అసంతృప్తి తారా స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో అధికార పార్టీకి తిరిగి గద్దెను దక్కించుకోవడం ఎలా అనేది యక్ష ప్రశ్నగా మారింది. ఎన్నికలు అనౌన్స్ అవడానికి ఇరవై రోజుక ముందే కేసీఆర్ 115 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసి చాలా అడ్వాన్స్‌డ్ గా దూసుకుపోయారు. ఇతర పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే లోపే రకరకాల వ్యూహాలను రచించి అమలు పరిచేందుకు సిద్ధమైయ్యారు.
బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఈ ఎన్నికలలో అమలు చేయబోయే వ్యూహం అష్టదిగ్బంధనాన్ని తలపించేలా ఉంది. ఆ వ్యూహాలేంటో చూద్దాం..
మొదటిది..
ఎక్కడో డబ్బులు పట్టించి ఇది ఫలానా పార్టీదే అని నమ్మించడం.. ఇది మొన్న కర్నాటక రాష్ట్ర బెంగళూరులో పట్టుబడిన 42 కోట్ల రూపాయిలను సూచిస్తుంది. అక్కడెక్కడో ఐటీ రెయిడ్లు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పంచడానికి తరలిస్తున్న డబ్బంటూ ప్రచారం చేసారు. ఈ నెలా పదిహేను రోజుల కాలంలో ఇలాంటి వార్తలు తమిళనాడు, మహరాష్ట్ర, గుజరాత్‌లకు అంటినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
రెండోది
కాంగ్రెస్ పార్టీలో దాదాపు యాభై నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు కొట్లాటలు జరుగుతున్నాయి. వాళ్లలో టికెట్ లభించినవారిని ఒదిలి మిగతావాళ్లని తమ పార్టీలోకి ఆహ్వానించడమో లేదంటే రెబెల్స్ గా పోటీ చేసేందుకు ప్రేరేపించడమో జరుగుతుంది‌.
మూడోది..
ఓడిపోయే స్థానాల్లో అవతలి పార్టీ నుంచి గెలిచే గుర్రాలను లాగడం లేదా.. అవతలి పార్టీల ఓట్ ఇన్‌ఫ్లుయెన్సర్లను తమ పార్టీ నుంచి బరిలో దించడం‌. ఈ వ్యూహానికి అవసరమైతే ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులను కన్విన్స్ చేసి మార్చుకోగలుగుతారు.
నాలుగు‌‌..
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు కాబట్టి.. టీడీపి క్యాడర్‌ని తమవైపు ఆకర్షించడం. మొన్న ఖమ్మంలో సీనియర్ ఎన్టీయార్ వంద అడుగుల విగ్రహాన్ని స్వయంగా కేటీఆర్ ప్రారంభించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు‌‌.‌.
ఈ చిన్న చిన్న స్ట్రేటజీలతో పాటు‌.. కాంగ్రెస్ నుంచి బయటికి వస్తున్న అసంతృప్త బీసీ లీడర్లను ఆహ్వానించడం. రేవంత్ రెడ్డి ఇతరులు అందరూ కలిసి కాంగ్రెస్‌ను రెడ్డిల పార్టీని కేవలం రెడ్ల పార్టీ అంటూ చిత్రీకరించి బీసీల ఓట్లను పోలరైజ్ చేసుకోవడం జరుగుతుంది..,
ఐదోది..
తమ పార్టీకి ఎక్కడెక్కడ ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయో అక్కడ చిన్న చిన్న పార్టీల అభ్యర్థులను రంగంలోకి దించి వెయ్యి రెండు వేల ్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేయడం. పది రోజుల క్రితమే జనసేన పార్టీ 32 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది‌. తీక్షణంగా గమనిస్తే ఆ స్థానాలన్నీ కేసీఆర్‌కు చెక్ పెట్టేవే అనేది తెలుస్తుంది‌. జనసేనతో పాటు వైఎస్సార్టీపి, బీఎస్పీ వంటి పార్టీల సహాయం కూడా బీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్టీపి పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా 119 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది కాబట్డి ఈ సిచుయేషన్ ను కేసీఆర్ ఉపయోగించుకోవచ్చు.
ఇక ఆరోది..
ఎక్కడికక్కడ నాకాబందీ చేసి ఏ పార్టీ వాళ్ళకీ డబ్బులు చేరనీయకుండా ఆర్థికంగా దెబ్బకొట్టడం.. ఇది కేంద్ర ప్రభుత్వంతో బీఆర్ఎస్ గుడ్ టర్మ్స్‌లో ఉందని జరుగుతున్న ప్రొపగాండాకు ఆపాదించబడుతుంది. ఒకవేళ సెంట్రల్ సపోర్ట్ ఉంటే పరిస్థితులు మరింత కట్టుదిట్టం అవుతాయి.
ఏడో స్ట్రేటజీగా‌‌..
తనను తన పార్టీని నిర్భయంగా ఎదురుకునే నేతలను కట్టడి చేసే ప్రయత్నం చేయడం. కాంగ్రెస్, బిజేపి పార్టీలోని సమర్ధవంతమైన నాయకులు, ప్రజాప్రతినిధుల పై కేసులు వేయించడం, బైండోవర్ చేయించడం వంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి నాయకుల పై సొంత ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎప్పటి పరిస్థితుల పై అప్పుడే ఆరా తీసి కట్టడి చేయడం. ఒకవేళ లావాదేవీల వివరాలు అందితే ఆ డబ్బును నిలువరించడం. ముఖ్య నేతలు, బలమైన నేతల క్యాడర్ మీద నిఘా ఉంచడం నయానో భయానో వాళ్ళని లొంగదీసుకునే ప్రయత్నం చేయడం‌. సొంతపార్టీ లుకలుకలతో ఉన్న నాయకులని లోపాయకారి ఒప్పందంతో వశపరుచుకోవడం వంటివి జరుగుతాయి.
ఇక చివరిగా తన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి.. మొదటి నుంచీ కేసీఆర్ పై చిచ్చరపిడుగులా విరుచుకుపడే రేవంత్ పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేసే అవకాశం ఉంది‌. అతని పై ఇప్పటికే ఉన్న కేసులని రీఓపెన్ చేయించి.. కొత్తగా కేసులు వేయించే అవకాశాలు ఉన్నాయి‌. అలా చేసి, అంక్షలు విధించి రేవంత్‌ను కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. రేవంత్‌ను కట్టడి చేస్తే కాంగ్రెస్ పార్టీలోని అతని వ్యతిరేక వర్గాన్ని తనవైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేయవచ్చనే ఆలోచన కూడా చేస్తారు కేసీఆర్.
115 మందితో తొలిజాబితా విడుదల చేసిన నాడే వచ్చే ఎన్నికలకి కేసీఆర్ సూపర్ అడ్వాన్స్‌గా ఉన్నాడు అనిపించుకున్నారు. తను ఇంతకు ముందు చేసిన స్ట్రేటజీలన్నీ వందకు వందశాతం నెరవేర్చుకున్నాడు. కానీ ఈసారి దళితబందు, బీసీ బందు, గృహలక్ష్మి వంటి పథకాలు బెడిసికొట్టాయి. కొత్తహామీలిచ్చినా జనాలు నమ్మే పరిస్థితులలో లేరని గ్రహించిన కేసీఆర్.. పైన పేర్కొన్న పలురకాల వ్యూహాలు అమలు పరిచేందుకు సిద్ధమయ్యారు.


Tags:    

Similar News