హంగ్ వస్తే... కేసీయారే కింగ్
మెజార్టీ సర్వేలన్నీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టి తాము హ్యాట్రిక్ కొడతామని బీయారెస్ అగ్రనేతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. డెబ్బయ్ సీట్లతో తాము మళ్ళీ పాలన పగ్గాలు అందుకుంటామని కేటీయార్ ప్రకటించారు. ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్ అందుకోలేని పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

ఎవరికీ పూర్తి మెజార్టీ రాని స్థితిలో మళ్లీ కేసీయార్ కింగ్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ 55 వరకూ సీట్లు సాధించుకుని ఆగిపోతే, అధికారం చేపట్టడం ఆ పార్టీకి అసాధ్యం. కాంగ్రెస్‌కు భాజపా మద్దతు ఇవ్వదు. ఆ 55 సీట్లతో కేసీయార్ ఆగిపోతే ఆయనకు మద్దతివ్వడానికే భాజపా ముందుకు వస్తుంది. ఐదు నుంచి ఏడు సీట్లు సాధిస్తాయని భావిస్తున్న ఎం.ఐ.ఎం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. సెక్యులర్ పార్టీ కనుక కాంగ్రెస్‌కే ఒవైసీ మద్దతిస్తారని అనుకోడానికి లేదు. ఆయనకు దేశ రాజకీయాల కంటే తెలంగాణలో తన పార్టీ, తన వర్గం ప్రయోజనాలే ముఖ్యం.
గత పదేళ్ల నుంచి ఒవైసీ బ్రదర్స్ కేసీయార్‌కు బేషరతు మద్దతు ప్రకటిస్తున్నారు. దీనివల్ల రెండు పార్టీలు బాగానే ఉన్నాయి. భారాసకు యాభై సీట్లు దాటి, కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా భారాస అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. భాజపా మద్దతు కానీ తీసుకుంటే, కేసీయార్ పాలన ఎంత సవ్యంగా, స్వేచ్ఛగా ఉంటుందో చెప్పలేం.