ఇక పదమూడు జిల్లాల్లో ఉధృతం చేయాల్సిందే
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 13 జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. విజయవాడలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 13 జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. విజయవాడలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 13 జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. విజయవాడలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే వచ్చే నెలలో ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలవాలని కూడా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అడ్డుకోవాలని నిర్ణయించారు. అలాగే రైతులు మానసిక వేదనతో మరణిస్తున్నారని, అలాంటి వారికి ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. పదమూడు జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందని అభిప్రాయపడ్డారు.