ప్రభుత్వం బలహీనంగా మారిపోయింది
రాజకీయంగా ప్రభుత్వం బలహీనమయిందని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసమే తాను పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసినట్లు [more]
రాజకీయంగా ప్రభుత్వం బలహీనమయిందని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసమే తాను పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసినట్లు [more]
రాజకీయంగా ప్రభుత్వం బలహీనమయిందని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసమే తాను పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసినట్లు కోదండరామ్ తెలిపారు. ఉద్యోగులు, అధికారులపై టీఆర్ఎస్ ప్రభుత్వం వత్తిడి తీసుకువచ్చిందని కోదండరామ్ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను కూడా బరిలోకి దించిందని చెప్పారు. ఇంత చేసిన ప్రభుత్వం అరకొర మెజారిటీతోనే విజయం సాధించిందన్నారు. నైతికంగా తనదే గెలుపు అని కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.