పూజారి లాంటి వాడిని

వైఎస్ జగన్ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తనపై కక్ష కట్టి మరీ అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. తాను అసెంబ్లీని [more]

Update: 2019-08-21 03:46 GMT

వైఎస్ జగన్ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తనపై కక్ష కట్టి మరీ అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. తాను అసెంబ్లీని దేవాలయంలాగా చూస్తానని, తాను పూజారి లాంటి వాడినని కోడెల చెప్పారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను తాను ఎప్పుడో తీసుకెళ్లమని అసెంబ్లీ అధికారులకు లేఖ రాశానని కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు. అసెంబ్లీ అధికారులను బెదిరించి మరీ వైసీపీ నేతలు తాను ఫర్నీచర్ ను తీసుకెళ్లినట్లు చిత్రీకరిస్తున్నారన్నారు. రాజధాని అమరావతిని మారిస్తే ప్రజలు తిరగబడతారని కోడెల హెచ్చరించారు.

Tags:    

Similar News