బ్రేకింగ్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా పక్షపాతం, శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స [more]

Update: 2019-02-22 09:58 GMT

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా పక్షపాతం, శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన తెలుగు, తమిళం, కన్నడ బాషల్లో వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనేక హిట్ సినిమాలను అందించారు. ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అమ్మోరు, అరుంధతి, దేవిపుత్రుడు వంటి విభిన్న చిత్రాలతో ఆయన ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులు అందరితోనూ కోడి రామకృష్ణ సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. తన కెరీర్ లో మొత్తం 10 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఆయన అందుకున్నారు. ఆయన తీసిన తొలి చిత్రం ఏకంగా 525 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. కోడి రామకృష్ణను ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

Tags:    

Similar News