ఏపీ డిప్యూటీ స్పీకర్ కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ [more]

Update: 2020-08-03 04:49 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు. కోన రఘుపతితో పాటు ఆయన భార్యకు, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కోనరఘుపతి స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. తనను వారం రోజులుగా కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోన రఘుపతి కోరారు. ఆయన వారం రోజుల పాటు అధికారిక కార్యక్రమాలన్నింటిని వాయిదా వేసుకున్నారు.

Tags:    

Similar News