తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం
తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేశానని చెప్పారు. అయితే ఏ పార్టీలో [more]
తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేశానని చెప్పారు. అయితే ఏ పార్టీలో [more]
తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేశానని చెప్పారు. అయితే ఏ పార్టీలో చేరాలన్నదీ ఇంకా నిర్ణయించుకోలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ మూడేళ్లు వెంటపడితేనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కేసీఆర్ తాను అనుకున్న విధంగా తెలంగాణను తీర్చిదిద్దలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను షర్మిల పార్టీలో చేరే ప్రసక్తి లేదని తెలిపారు. షర్మిల పార్టీ తెలంగాణకు వ్యతిరేకమన్నారు. ఎక్కువ ప్రాంతీయ పార్టీలు వస్తే కేసీఆర్ కు లాభమన్నారు. ఈటల రాజేందర్ తో కూడా కేసీఆర్ ప్రాంతీయ పార్టీ పెట్టవచ్చని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు.