కొప్పుల ఈశ్వర్ కు ఎన్నాళ్లకెన్నాళ్లకు…??
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నాటి నుంచి అధినేత కేసీఆర్ వెన్నంటే నడిచిన వ్యక్తి కొప్పుల ఈశ్వర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నాటి నుంచి అధినేత కేసీఆర్ వెన్నంటే నడిచిన వ్యక్తి కొప్పుల ఈశ్వర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నాటి నుంచి అధినేత కేసీఆర్ వెన్నంటే నడిచిన వ్యక్తి కొప్పుల ఈశ్వర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలతో కలిపి వరుసగా ఆయన టీఆర్ఎస్ తరపున ఆరుసార్లు విజయం సాధించారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు గత క్యాబినెట్ లోనే మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అప్పటికే ఇద్దరు మంత్రులు ఉండటంతో ఆయనకు దక్కలేదు. దీంతో ఆయనకు చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. ఈసారి ఆయనకు ఊహించినట్లుగా కేసీఆర్ మంత్రి పదవిని కేటాయించారు. మొదటిసారి మంత్రి పదవి స్వీకరిస్తున్న ఆయనకు విద్యాశాఖ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.