వారి పనితీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సరిగా నిర్వహించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం [more]

Update: 2021-03-02 01:03 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సరిగా నిర్వహించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. సభ్యత్వ నమోదుకు ఇచ్చిన సమయం పూర్తయినా ఇంకా కొందరు మందకొడిగా చేస్తుండటంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరో వారం రోజులు సభ్యత్వ నమోదుకు అవకాశమిస్తున్నట్లు కేటీఆర్ వారితో చెప్పారు.

Tags:    

Similar News