రెండు నిమిషాల్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ ముగించి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా కొన్ని సీట్లను కోల్పోయామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఛాన్స్ [more]

Update: 2020-12-04 15:02 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా కొన్ని సీట్లను కోల్పోయామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఛాన్స్ ఇచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు పది నుంచి పన్నెండు స్థానాల్లో స్వల్ప తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. తాము అంచనా వేసుకున్న దానికంటే ఇరవై ఐదు సీట్లు తగ్గాయని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు మేయర్ అభ్యర్థి ఎవరనేది? ఎలా అనేది నిర్ణయిస్తామని కేటీఆర్ తెలిపారు. ఓటమికి గల కారణాలపై పార్టీలో అంతర్మదనం చేసుకుంటామన్నారు. రెండు నిమిషాల్లో మీడియా సమావేశం ముగించి కేటీఆర్ వెళ్లిపోయారు.

Tags:    

Similar News