సుప్రీంకోర్టుకు కేటీఆర్

రేవంత్ రెడ్డి వేసిన ఫామ్ హౌస్ కేసుపై సుప్రీంకోర్టు లో కేవియట్ ను మంత్రి కెటిఆర్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సుప్రీంకోర్టు లో [more]

Update: 2020-07-02 02:11 GMT

రేవంత్ రెడ్డి వేసిన ఫామ్ హౌస్ కేసుపై సుప్రీంకోర్టు లో కేవియట్ ను మంత్రి కెటిఆర్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సుప్రీంకోర్టు లో మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు చేశారు. కెటిఆర్ తో పాటు మరో రెండు కేవియట్ల ను బద్వేలు ప్రదీప్ రెడ్డి వేశారు. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం పై గతంలో ఎన్ జి టి ని రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. విచారణ తర్వాత గత నెల ఐదో తేదీన కెటిఆర్ సహా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ జి టి. నోటీసులు జారీచేసింది. వివాదాస్పద ఫాం హౌస్ అక్రమమా, సక్రమంగా జరిపారో తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని ఎన్ జి టి ఏర్పాటు చేసింది. ఎన్ జి టి ఆదేశాలను సవాలు చేస్తూ కెటిఆర్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు లో మంత్రి కేటీఆర్ కి ఊరట లభించింది. జూన్ పదవ తేది ఎన్ జి టి ఆదేశాలపై స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే స్టే ఆర్డర్ కాపీ వెలువడడానికి ముందే సుప్రీంకోర్టు లో కెటిఆర్ కెవియట్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు కు కు గత నెల 19 నుంచి వేసవి సెలవులు ఉన్నాయి. సుప్రీంకోర్టు సెలవులు పూర్తయిన తర్వాత ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News