బ్రేకింగ్ : కుమారస్వామి వచ్చే లోపు….?
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రేపు రాత్రికి ఆయన అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈలోపే సంకీర్ణ సర్కార్ సంకటంలో పడనుంది. కాంగ్రెస్ [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రేపు రాత్రికి ఆయన అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈలోపే సంకీర్ణ సర్కార్ సంకటంలో పడనుంది. కాంగ్రెస్ [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రేపు రాత్రికి ఆయన అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈలోపే సంకీర్ణ సర్కార్ సంకటంలో పడనుంది. కాంగ్రెస్ కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, జనతాదళ్ ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడ స్పీకర్ లేకపోవడంతో ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం 224 శాసనసభ్యులున్న కర్ణాటక శాసనసభలో ఇప్పటికి 14 మంది శాసనసభ్యులు రాజీనామా బాట పట్టడంతో సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో పడింది. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. రాజీనామాలు ఆమోదం పొందితే సంకీర్ణ సర్కార్ సంకటంలో పడినట్లే. గవర్నర్ ఒకవేళ అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీని బలనిరూపణకు ఆదేశించవచ్చు. లేకుంటే మధ్యంతర ఎన్నికలు జరగవచ్చు.