బ్రేికింగ్ : ఇక్కడ సైకిలెక్కారు… అక్కడ కారెక్కారు…!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రేపు ఆయన ఎగ్జిట్ పోల్స్ చెప్పనున్నా ఇవాళ ప్రత్యేకంగా విజయవాడలో [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రేపు ఆయన ఎగ్జిట్ పోల్స్ చెప్పనున్నా ఇవాళ ప్రత్యేకంగా విజయవాడలో [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రేపు ఆయన ఎగ్జిట్ పోల్స్ చెప్పనున్నా ఇవాళ ప్రత్యేకంగా విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఫలితాలపై హింట్ ఇచ్చారు. ‘‘అధిక బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ప్రజలు కారు ప్రయాణాన్ని కోరుకున్నారు… లోటు బడ్జెట్ తో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ ప్రయాణాన్ని కోరుకున్నారు’’ అని చెప్పి ఏపీలో టీడీపీ గెలుస్తుందని హింట్ ఇచ్చారు. రేపు పూర్తి ఎగ్జిట్ పోల్స్ వివరాలు తిరుపతిలో చెబుతానని పేర్కొన్నారు. కాగా, ప్రెస్ మీట్ లో లగడపాటి మాటల కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. అరగంట కూడా జరగని ప్రెస్ మీట్ లో కనీసం పదిసార్లు తనకు ఏ పార్టీతో సంబంధం లేదని లగడపాటి చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు పాలనను ఆకాశానికెత్తారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణం అవుతోందని, ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రెస్ మీట్ కి ముందు లగడపాటి టీడీపీ నేత బుద్దా వెంకన్నతో చర్చలు జరపడం గమనార్హం