ఏపీలో లగడపాలటి లెక్క ఇదే…!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి. జనవరి నుంచి ప్రతి నెల సర్వే జరిపామని తెలిపారు. పోలింగ్ కు [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి. జనవరి నుంచి ప్రతి నెల సర్వే జరిపామని తెలిపారు. పోలింగ్ కు [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి. జనవరి నుంచి ప్రతి నెల సర్వే జరిపామని తెలిపారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా సర్వే చేశామన్నారు. శాస్త్రీయంగా సర్వే చేశామని, ఏ పార్టీతో తనకు సంబంధం లేదన్నారు. టీడీపీతో అధికారమని నిన్ననే చెప్పిన లగడపాటి ఇవాళ సీట్ల వివరాలను చెప్పారు. తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు 10 ఎక్కువ లేదా తక్కువ రావచ్చని ఆయన సర్వే అంచనా వేసింది. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని, ఆ పార్టీకి 72 స్థానాలకు ఏడు సీట్లు అటుఇటుగా రావచ్చని తేల్చారు. ఇతరులు 1 నుంచి 5 స్థానాలు సాధించవచ్చని సర్వే అంచనా వేసింది. పవన్ కల్యాణ్ కు మూడుసీట్లు రావచ్చని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ కు ప్లస్ 2 లేదా మైనస్ గా ఉంటుందన్నారు. టీడీపీకి 43 శాతం ఓట్లు, వైసీీపీికి 41 శాతం ఓట్లు రావచ్చన్నారు. రెండు పార్టీల మధ్య రెండు శాతం మాత్రమే తేడా ఉందన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి 11 శాతం ఓట్లు రావచ్చన్నారు.
లోక్ సభ సీట్లు కూడా….
లోక్ సభ సీట్ల విషయానికి వస్తే టీడీపీకి 15 నుంచి 17 రావచ్చని, వైసీపీకి 10 నుంచి 12 సీట్లు రావచ్చని, ఇతరులు 0 లేదా 1 సీటు సాధించవచ్చని తేల్చారు. టీడీపీకి 43 నుంచి 45 శాతం ఓట్లు పోలయ్యాయని, వైసీపీకి 40 నుంచి 42 శాతం, జనసేనకు 10 నుంచి 12 శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది. మహిళలు ఎక్కువగా టీడీపీకి, పురుషులు ఎక్కువగా వైసీపీకి, యువత ఎక్కువగా జనసేనకు ఓట్లేశారని తేల్చారు. టీడీపీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ ఉందని ఈ సర్వేలో తేలింది. తెలంగాణలో పార్లమెంటు సీట్లు టీఆర్ఎస్ కు 14 నుంచి 16దాకా రావచ్చు. కాంగ్రెస్ కు ఏమీ రాకపోవచ్చు వస్తే రెండు సీట్లు రావచ్చని లగడపాటి తెలిపారు. బీజేపీకి ఒకచోట అవకాశముందన్నారు.