April22-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనింది. అంతే కాదు ట్రక్కు కిందకు కారు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద జరిగింది. ఆగి ఉన్న లారీ కిందకు వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

Update: 2024-04-22 13:27 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Road Accident : ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. కారులో ఉన్న ఇద్దరూ

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనింది. అంతే కాదు ట్రక్కు కిందకు కారు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద జరిగింది. ఆగి ఉన్న లారీ కిందకు వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

Breaking : కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్.. తీర్పు ఎప్పుడంటే

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన తీర్పును ప్రకటించనుంది. . ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

BRS : కేసీఆర్ ఈయనను వదలరా? పార్టీకి ఇంత నష్టం జరుగుతున్నా ఎందుకంత ఇష్టం?

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. కేసీఆర్ వ్యవహార శైలి కొంత కారణమైతే జిల్లాకొక నేత కేసీఆర్ లా మారడం కూడా పార్టీ ఓటమికి కారణమన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక్క జిల్లాలోనే కాదు.. తుడుచు పెట్టుకుపోయిన జిల్లాలను పరిశీలించినప్పుడు ఇదే అర్థమవుతుంది.

Tekkali : దువ్వాడకు వాయిస్ తప్ప.. బేస్ లేదా..? టెక్కలిలో వైసీపీకి కష్టాలు స్వయంకృతమేనా?

దువ్వాడ శ్రీనివాస్.. టెక్కలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టెక్కలి అంటేనే కింజారపు కుటుంబానికి పెట్టని కోట. అలాంటి చోట వైసీపీ ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి. అక్కడ వైసీపీ అధినాయకత్వం అన్నీ రాంగ్ స్టెప్‌లు వేశాయని చెబుతున్నారు. కేవలం జగన్ తనకున్న అభిమానంతోనే ఆ టిక్కెట్ ను దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించారన్న అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతుంది. ఒక్క దువ్వాడ కోసం అందరినీ దూరం చేసుకుంటున్నారు.

Chiranjeevi : చిరంజీవి మెసెజ్ మామూలుగా లేదుగా... ఇక లాభం లేదనుకుని ఎంట్రీ ఇచ్చేశారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఓపెన్ అయిపోయారు. తన అభిమానులకు ఆయన పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగానే పిలుపు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పారు. దీంతో ఇప్పుడు ఏపీ రాజీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఏపీ రాజకీయాలు అంటేనే ఎప్పడూ హాట్ హాట్ గా ఉంటాయి.

IPL 2024 : ఈ మ్యాచ్ కు అతితక్కువ రేటింగ్.. టీవీలు ఆఫ్ చేశారట ...చూసేవాళ్లు కొద్దిమందేనట

ప్రతి ఆదివారం క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు మ్యాచ్ లు జరుగుతూ అలరిస్తుంటాయి. ఐపీఎల్ అంటేనే టెన్షన్ పెడుతూ చివరి బంతి వరకూ విజయం ఎవరిదో కూడా తేలని పరిస్థితి ఉంటుంది. అందుకే ఐపీఎల్ పదిహేడు సీజన్లయినా అంత హిట్టవుతుంది. ఇంకా ఎన్ని సీజన్లు అయినా అంతే.

YSRCP : జగన్ దెబ్బకు సీనియర్ నేత బలి.. ఓడిపోతే కారణం అధినేతే కారణమట

శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గెలుపుపై హైరానాపడుతున్నారు. ఆయన ఈసారి గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుందట. ధర్మాన ప్రసాదరావు ఈసారి తనను ఒగ్గేయమని, తన కుమారుడికి అవకాశమివ్వాలని, తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. లేదు.. లేదు..

ఉద్యోగులకు ఒకటోతేదీనే జీతాలు కావాలా?

మంగళగిరి మండలం కాజాలోని అపార్ట్ మెంట్ వాసులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అయ్యారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తామని ఆయన తెలిపారు. అదృశ్యమైన అమ్మాయిల ఆచూకీ గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ఇటీవల శ్రీరామ నవమి వేడుక సందర్భంగా జరిగిన ర్యాలీలో చేసిన ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉండటంతో పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి రోజు హైదరాబాద్ నగరంలో ఏటా శోభాయాత్రను నిర్వహిస్తారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని మరో పెళ్లికి రెడీ.. కారం చల్లి వధువు కిడ్నాప్‌కు యత్నం

ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. మరో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో ఇది తెలిసిన అమ్మాయి బంధువులు పెళ్లిమండపంలో ఉన్న వధువును కిడ్నాప్‌కు చేసేందుకు యత్నించారు. తూర్పు గోదావరి జిల్లా కడయంలో ఈ ఘటన జరిగింది. మరికొద్ది సేపట్లో వివాహం జరగబోతుండగా కారం చల్లుతూ ఫంక్షన్ హాలులోకి ప్రవేశించి వధువును ఎత్తుకెళ్లారు.




Tags:    

Similar News