టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Breaking- Blasts in Bengaluru:బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం నాడు పేలుడు సంభవించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ బ్లాగర్లకు ఈ కేఫ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేది. బెంగళూరులో ఈ కేఫ్ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. పేలుడు జరిగినప్పుడు కూడా రామేశ్వరం కేఫ్ లో భారీగా జనం ఉన్నారు.

Update: 2024-03-01 11:27 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking- Blasts in Bengaluru: బెంగళూరులోని 'రామేశ్వరం కేఫ్' లో పేలుడు

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం నాడు పేలుడు సంభవించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ బ్లాగర్లకు ఈ కేఫ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేది. బెంగళూరులో ఈ కేఫ్ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. పేలుడు జరిగినప్పుడు కూడా రామేశ్వరం కేఫ్ లో భారీగా జనం ఉన్నారు. అయితే ఈ పేలుడు మరీ తీవ్రమైనది కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడు వెనుక ఎవరి కుట్ర అయినా ఉందా..

శరీరంలో నాలుగు రకాల కొలెస్ట్రాల్స్‌ ఉంటాయని మీకు తెలుసా? ఇందులో ఏదీ ప్రమాదకరం!

నేటి కాలంలో శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న వయసులోనే మనుషుల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోంది. దీని వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది కొలెస్ట్రాల్‌ని తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకుంటారు. ఇందులో ఒకటి రెండు కాదు నాలుగు రకాల కొలెస్ట్రాల్ శరీరంలో వెల్లడవుతుంది.

Good News: ఫాస్టాగ్ కేవైసీ గడువు పెంపు

FASTag వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా, NHAI 'ఒక వాహనం, ఒక ఫాస్ట్‌ట్యాగ్' కోసం గడువును మార్చి చివరి వరకు పొడిగించనుంది. గతంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు అని చెప్పింది. అయితే Patym FASTag వినియోగదారులు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Jobs: నెలకు 60వేల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) సంస్థలోని కోర్ ఇంజనీరింగ్ రంగాలలో ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. పలు స్థానాలలో మొత్తం 43 మంది అభ్యర్థులను నియమించనున్నారు.

Vidya Deevena:నేడే.. వారి అకౌంట్లలోకి డబ్బుల జమ

Vidya Deevena:జగనన్న విద్యాదీవెన నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చి 1వ తేదీన విడుదల చేయనుంది. కృష్ణా జిల్లా పామర్రులో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి విద్యాదీవెన డబ్బులు విడుదల చేయనున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29న నిర్వహించాలని భావించినా కొన్ని అనివార్యకారణాల వల్ల మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు.

Inter Exams: నేటి నుండి ఇంటర్ పరీక్షలు

Inter Exams:ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు మొదటి ఏడాది, రేపు రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరగనుంది.

Scarlet Disease:పిల్లలను, తల్లిదండ్రులను భయపెడుతున్న 'స్కార్లెట్'

Scarlet Disease:హైదరాబాద్ నగరంలో స్కార్లెట్ ఫీవర్ టెన్షన్ మొదలైంది. చిన్న పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ జ్వరం బారినపడుతున్నారు. ఆసుపత్రులలో స్కార్లెట్‌ ఫీవర్ బాధితుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఆసుపత్రులకు జ్వరంతో వెళుతున్న ప్రతి 20 మంది పిల్లల్లో 10-12 మందిలో స్కార్లెట్‌ ఫీవర్ లక్షణాలు ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది.

YS Sunitha:వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్.. ప్రజాకోర్టులో తీర్పు కావాలి

YS Sunitha:దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. గత కొన్ని నెలలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేసిన వైఎస్ సునీత తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా వైసీపీని గెలిపించకూడదని చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ లో హత్యా రాజకీయాలు ఉండకూడదని పిలుపును ఇచ్చారు.

Cool Water: కూల్ వాటర్ తాగుతున్నారా? గుండెకు ప్రమాదకరం!

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనలో చాలా మంది ఫ్రిజ్‌ వాటర్‌ను తాగుతుంటారు. ఈ కూల్ వాటర్ తాగడం వల్ల చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది అన్నది నిజం. కానీ, ఇలా ఐస్ వాటర్ తాగడం వల్ల మన గొంతుపైనే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ప్రభావం చూపుతుందని తెలుసుకోవడం మంచిది.

Lasya Nanditha:ఎమ్మెల్యే లాస్య మృతి కేసులో.. ఊహించని ట్విస్ట్

Lasya Nanditha:బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదం తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్‌‌ను పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా టిప్పర్‌ను గుర్తించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News