10June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో 274 మంది పాలస్తానీయన్లు మరణించారు. అయితే చిత్రం ఏంటంటే ఈ ఆపరేషన్ కేవలం నలుగురి కోసమే. నలుగురు బందీలను విడిపించడం కోసం ఇజ్రాయిల్ చేపట్టిన ఆపరేషన్ లో 274 మంది మరణించడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Update: 2024-06-10 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

నలుగురి కోసం.. 274 మంది బలి.. ఇదెక్కడి చిత్రంరా బాబూ

ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో 274 మంది పాలస్తానీయన్లు మరణించారు. అయితే చిత్రం ఏంటంటే ఈ ఆపరేషన్ కేవలం నలుగురి కోసమే. నలుగురు బందీలను విడిపించడం కోసం ఇజ్రాయిల్ చేపట్టిన ఆపరేషన్ లో 274 మంది మరణించడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..చంద్రబాబు ఆ పని చేస్తే ఇక తిరుగులేదటగా.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన సూపర్ సిక్స్ తో పాటు మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలతో పాటు గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకుని పాలన సాగించాలని నిర్ణయించారు.

Purandhreswari : అంకెలు భయపెట్టే సమయంలో బీజేపీ నేతలు ఆ సాహసం చేస్తారా?

లోక్‌సభ స్పీకర్ గా పురంద్రీశ్వరి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే పురంద్రీశ్వరిని స్పీకర్ గా ఎన్నిక చేసేవారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుత్లో ఆమె పేరు పరిశీలనలోకి రావడం కూడా కష్టమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.

YSRCP : పెద్దిరెడ్డి పని పట్టేందుకు సిద్ధం అవుతున్నారా? ఏ రేంజ్ లో రెడీ అవుతున్నారంటే?

అందరి లక్ష్యం ఆయనే. ఆయన టార్గెట్ గా రాబోయే రాజకీయమంతా నడుస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శత్రువుల సంఖ్య అపారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి పని పట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ నేతలంతా కాచుకూర్చుని ఉన్నారు. ఒక్కరైతే పర్లేదు. కానీ కూటమిలోని మూడు పార్టీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శత్రువులున్నారు.

Ys Vijayamma : వైఎష్ విజయమ్మ.. కనీసం జగన్ కు ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదట.. రీజన్ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవి చూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమయింది. వైఎస్ జగన్ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకూ ఈ షాక్ నుంచి కోలుకోలేదు. అస్సలు ఊహించని ఫలితాలు ఇవన్నది వారి అభిప్రాయం. గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా కనీసం 90 నుంచి వంద స్థానాలు వస్తాయని చాలా మంది అంచనాలు వేశారు.

T20 World Cup 2024 : విజయం మాత్రం వారిదే.. ఊరికే అలా వచ్చి అవుటయిన వారిది మాత్రం కాదట

నిన్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఇలాంటి జట్టు ఎలా ఈ వరల్డ్ కప్ లో రాణిస్తుందన్న సందేహం తలెత్తక మానదు. చాలా మంది టీవీలు ఆఫ్ చేసుకుని మరీ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతుండటం భారత్ బ్యాటర్ల వంతయింది. ఒక్కరూ సరిగా నిలబడలేదు. విరాట్ కోహ్లి మొదటి మ్యాచ్ లో మాదిరిగానే మళ్లీ వెంటనే వెనుదిరిగాడు.

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి దిగుతారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు.

Narendra Modi : మోదీ తొలి సంతకం.. 20 వేల కోట్ల నిధులు విడుదల

ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. సౌత్ బ్లాక్ లో ప్రధానిగా మూడోసారి బాధ్యతలను చేపట్టిన నరేంద్ర మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. 17వ విడత దేశంలోని రైతులకు పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఈ సంతకం చేశారు. మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు ఈ నిధులు అందనున్నాయి.

నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్

నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. మేయర్ పొట్టూరి స్రవంతితో పాటు భర్త జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. తాము రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు తెలిపారు. తాము అపట్లో అధికార పార్టీ వత్తిడితోనే కోటంరెడ్డికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు. తమపై వత్తిడి అధికంగా ఉండటం వల్లనే వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని స్రవంతి వివరణ ఇచ్చారు.

మాజీమంత్రి తలసాని ఇంట్లో విషాదం

బీఆర్ఎస్ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ ఇంట విషాదం నెలకొంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్.. సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మఋతి చెందారు.





Similar News