టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఒకటి కాదు ఫ్యామిలీ ప్యాక్, భట్టిని కలిసిన వైఎస్ షర్మిల...వంతెనను ప్రారంభించిన మోదీ 'గుంటూరు కారం' చూసిన మహేష్.. కొత్త ఎలక్ట్రిక్ కార్లు

Update: 2024-01-12 12:45 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

YSRCP : లక్కు అంటే వీరిదే.. కదా.. అడక్కుండానే టిక్కెట్లు... ఒకటి కాదు ఫ్యామిలీ ప్యాక్

వైసీపీలో సీనియర్లను కూడా పక్కన పెడుతున్నారు. వరసగా విడుదలవుతున్న జాబితాలు అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికి 59 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేపట్టారు. దాదాపు ఇరవై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు రావని తేలిపోయింది

Gold Prices : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నిలకడగా సాగుతున్న వెండి ధర

పసిడి ప్రియులకు సంక్రాంతి ముందు మంచి శుభవార్త చేరింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. పసిడి పతనం ప్రారంభం కావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పెద్దగా పెరగడం లేదు

భట్టిని కలిసిన వైఎస్ షర్మిల

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వచ్చారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను భట్టి విక్రమార్కకు ఇచ్చేందుకు ఆమె ప్రగతి భవన్ కు వచ్చారు.

Pawan Kalyan : అనుకున్నదే అవుతుందిగా... టీడీపీ నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారుగా

ఎప్పటి నుంచో జనసైనికులు ఊహించిందే. టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేేరతారని అంచనా వేశారు. అది ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ చంద్రబాబు స్ట్రాటజీ. తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టిక్కెట్లు కేటాయించి గెలిపించుకోవడం చంద్రబాబుకు ఇప్పటి నుంచి కాదు..

అతి పెద్ద వంతెనను ప్రారంభించిన మోదీ

ముంబయిలో దేశంలోనే అతి పెద్ద వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింగ్ ను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు


Guntur Kaaram : ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' చూసిన మహేష్.. కానీ నిరాశగా..

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మాస్ మసాలా చిత్రం 'గుంటూరు కారం' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ నుంచి రిలీజైన మహేష్ మాస్ లుక్స్, సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.


అనారోగ్య సమస్యలను తరిమికొట్టే ఈ ఆకుకూర జ్యూస్‌

మనం తరచుగా తీసుకునే కూరగాయలలో క్యారెట్ లేదా టొమాటోలను ఉపయోగిస్తాము. ఆకు కూరలు తినడం కంటే రసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. వాటిలో సెలెరీ ఒకటి. ఇది ఇతర కూరగాయల కంటే ఎక్కువ పోషకాలను అందించే కూరగాయల రకం.

India vs Afghanistan : తొలి మ్యాచ్ మనదే.. సిరీస్ ఆధిక్యం.. దూబే లేకుంటే?

ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్ దే విజయం అయింది. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక దశలో భారత్ ఓటమి తప్పదని భావించినా చివరకు భారత్ దే పై చేయి అయింది. శివమ్ దూబే అర్థ సెంచరీ బాది జట్టును ఆదుకున్నాడు.


ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు ఇవే.. ఎలా నిర్ణయిస్తారు?

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాల పాస్‌పోర్ట్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. 


ఈ టాప్‌ బ్రాండ్ల నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్‌..

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాము. ముందు స్కూటర్లు రోడ్లపైకి ఎక్కగా, టాటా ఇతర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు కూడా వచ్చేశాయి.


Tags:    

Similar News