టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
నేడు ఇంయా కూటమి, హైవేపై హోటళ్లలోనూ పెరిగిన రద్దీ...నగరం అంతా ఖాళీ... మేడారం జాతర, భోగి పండ్లను పిల్లల తలపై
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
మంటల్లో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు.. మహిళ సజీవ దహనం
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు లో మంటలు వ్యాపించాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకారు.
Bhogi: భోగి పండ్లను పిల్లల తలపై ఎందుకు పోస్తారు..?
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తుంటారు.
Sankranthi : పందెంకోళ్లు రెడీ.. ఎన్నికల ఏడాది కావడంతో ఇక కుమ్మేయండి బాసూ
సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకొచ్చేది పందెం కోళ్లు. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో అనేక విశిష్టతలున్నప్పటికీ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. పందె కోళ్లు కాలు దువ్వుతుంటే మీసం మీద మెలేసిన చేయి దించరంతే.
మేడారం జాతరకు 75 కోట్లు విడుదల
మేడారం జాతర వచ్చే నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మేడారం జాతరపై సీతక్క అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో మేడారం జాతరలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
Gold Prices : ధరలు పెరగలేదని సంబరపడుతున్నారుగా.. ఇప్పుడు చూడండి.. మీకే అర్థమవుతుంది
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరగకపోవడంతో పసిడి ప్రియులు ఆనందపడుతున్నారు. ఇక బంగారం ధరలు మరింత దిగి వస్తాయని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. వారి నమ్మకంపై నీళ్లు చల్లినట్లయింది. బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.
Sankranthi : నగరం అంతా ఖాళీ... హైదరాబాద్ వీడి సొంతూళ్లకు.. రోడ్లన్నీ బోసిపోయి
హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయింది. ట్రాఫిక్ పెద్దగా లేదు. సౌండ్ అంతగా వినిపించడం లేదు. వాహనాల రద్దీ రహదారులపై లేదు. ఇదీ ఈరోజు హైదరాబాద్ లో పరిస్థితి. సంక్రాంతి పండగకు అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో నగరం దాదాపుగా ఖాళీ అయినట్లే. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి.
Ys Sharmila : వైఎస్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. గంటకు పైగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చంద్రబాబుతో చర్చించారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు.
Chandrababu : జగన్ పంథాలోనే చంద్రబాబు... సీనియర్లకు చెక్ చెప్పేయడమేనట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈసారి గెలుపు అత్యంత అవసరం. ఇప్పుడు గెలవకపోతే ఇక పార్టీ మనుగడ కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీస్ ఈసారి ఎన్నికల్లో కొన్ని కఠిన నిర్ణయాలనే తీసుకుంటారని చెబుతున్నారు. గెలుపు ఆధారంగానే టిక్కెట్లు ఉంటాయని చెబుతున్నారు.
High Way Hotels : హైవేపై హోటళ్లలోనూ పెరిగిన రద్దీ... తినడానికి సీటు దొరకడమూ కష్టమే
సంక్రాంతి పండగకు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒక్కటి కాదు.. రెండు కాదు వేల సంఖ్యలో వాహనాలు వచ్చి టోల్ ప్లాజాల వద్ద వెయిట్ చేస్తుండటం కనిపిస్తుంది.
India Alliance: నేడు ఇంయా కూటమి సమావేశం
ఇండియా కూటమి నేడు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల నేతలు హాజరు కానున్నారు. వర్చువల్ గా ఈ సమావేశం జరగనుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలిసింది.