టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
డూ..డూ..బసవన్నల నృత్యాలు...గంగిరెద్దుల విన్యాసాలు;వినుడు వినుడు రామాయణ గాథ; రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
డూ..డూ..బసవన్నల నృత్యాలు...గంగిరెద్దుల విన్యాసాలు
డూ..డూ..బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు, మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు.. గాలి పటాలతో సందడి, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులకు పెట్టింది పేరు.
వినుడు వినుడు రామాయణ గాథ
రామ మందిరం ప్రారంభోత్సవ వేళ తులసి దాస్ విరచిత రామ్ చరిత మానస్ పుస్తకాకానికి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ లో ఉన్న గీతా ప్రెస్ ఈ పుస్తకాన్ని తక్కువ ధరకు అందిస్తోంది. గత ఏడాది వరకు సంవత్సరానికి 75 వేల కాపీల వరకు ఈ రచనను ముద్రించి విక్రయించేవారు.
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సుప్రీమ్ కోర్ట్.. మంగళ వారం ఒక కీలక తీర్పు ఇవ్వబోతోంది. స్కిల్ స్కాంకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా, లేదా అనే విషయాన్నీ సర్వోన్నత న్యాయస్థానంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉదయం తేల్చనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆయన ఓ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'పక్కింట్లో చెత్త మన ఇంట్లో బంగారం అవుతుందా?' అని ప్రశ్నించారు.
KCR : బాస్ వచ్చేస్తున్నాడు..బీ రెడీ... ఇక కాసుకోండి అంటున్నారుగా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో జనం ముందుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన పర్యటనలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను భారీగా జరిపేందుకు పార్టీ నేతలు నిర్ణయించారు.
గుంటూరు కారం రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తి మాస్ రోల్ లో కనిపిస్తూ చేసిన సినిమా 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం జనవరి 12న రిలీజయింది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై భారీ హైప్ నెలకుండడంతో సినిమా భారీ స్థాయిలో విడుదలైంది.
ఎస్ .. నేను సంబరాల రాంబాబునే
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. ఆట పాటలతో అలరించారు. గతఏడాది తరహాలోనే అంబటి రాంబాబు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. గత ఏడాది అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది.
నేడు కీలక మ్యాచ్ .. సిరీస్ ను సొంతం చేసుకుంటారా?
నేడు ఇండియా - ఆప్ఘనిస్తాన్ రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతం అయినట్లే. ఇప్పటికే తొలి టీ 20 మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ 1 - 0 ఆధిక్యంతో నిలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ప్రారంభమయిన ఈ మ్యాచ్‌లలో ఇప్పటి వరకూ భారత్ దే పై చేయి అయింది.
మహేష్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. హాలీవుడ్‌లో ఇలా..
అవంతిక వందనపు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ చేసింది. మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి వేడితెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజన్, అజ్ఞాతవాసి సినిమాల్లో కూడా కనిపించింది.
ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు.. ఏపీ అధికారుల తీరుపై మంత్రి నిర్మలమ్మ అసహనం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఓచేదు అనుభవం ఎదురైంది. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన సీతారామన్ అధికారుల పనితీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 3వ తేదీన పరకాల ప్రభాకర్ తల్లి కాళికాంబ అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందారు.