Ration Cards : ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్.. వింటే ఆశర్చపోవడమే
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది;

ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా లబ్దిదారుల ఎంపిక చేపట్టింది. గతంలో అర్హులైనా రేషన్ కార్డులు లేకపోవడంతో అనేక మంది ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను వెలికితీసి అర్హులైన లబ్దిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అయితే సంక్షేమ పథకాలు ఈ కార్డు ద్వారా అందుతుండటంతో ఆచి తూచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరపాలని నిర్ణయించింది.
అర్హులైన వారందరికీ...
గత ప్రభుత్వంలో జారీ చేసిన కొందరికి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు చేయడంతో పాటు అర్హులైన వారికి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం విధివిధానాలు అందించింది. దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు గత ఐదేళ్లలో పెళ్లిళ్లు జరిగి విడిపోయిన జంటలు కూడా కొత్త రేషన కార్డుల కోసం దరఖస్తు చేసుకున్నారు. వీటన్నింటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏటీఎం కార్డు సైజులోనే...
మరో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే.. కొత్త రేషన్ కార్డులను కూడా పూర్తిగా మార్చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల సైజును కూడా తగ్గించనుంది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు.
చేర్చడం, తొలగింపు...
కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యులను చేర్చడంతో పాటు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి.