April15-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ముంబయి ఇండియన్స్ మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా సులువుగా ముంబయిదే విజయమని అనుకుంటారు. ఎందుకంటే రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఇంకా ఏడు ఓవర్లలో 83 పరుగులు చేయాల్సి ఉంది. అదేమీ పెద్ద లక్ష్యమేమీ కాదు.

Update: 2024-04-15 13:06 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

IPL 2024 : ఛేజింగ్ లో బ్యాటర్లు క్లిక్ అయితేనే విజయం.. అందుకే.. ముంబయి ఓటమి

నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ముంబయి ఇండియన్స్ మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా సులువుగా ముంబయిదే విజయమని అనుకుంటారు. ఎందుకంటే రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఇంకా ఏడు ఓవర్లలో 83 పరుగులు చేయాల్సి ఉంది. అదేమీ పెద్ద లక్ష్యమేమీ కాదు.

Ys Jagan : నా నుదుటి మీద దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు... మన గెలుపును ఎవరూ ఆపలేరు

తనమీద రాయి విసిరినంత మాత్రాన జగన్ బెదిరిపోడని వైఎస్ జగన్ అన్నారు. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో గెలుపు కౌరవులు నెగ్గినట్లు కాదన్నారు. ఒక రాయి విసిరినంత మాత్రాన మీ బిడ్డ అదరడు.

రెండు వందల కోట్ల ఆస్తి.. ఈ డబ్బు మాకొద్దు.. ప్రశాంతత కావాలంటూ?

డబ్బు ప్రశాంతతను ఇవ్వదు. మనశ్శాంతిని దరిచేర్చదు. మనల్ని కుదుటుగా ఉండనివ్వదు. నిద్రపోనివ్వదు. ఆరోగ్య సమస్యలు.. ఇలా డబ్బుతో అనేక ఇబ్బందులు. కానీ డబ్బులు లేని వారు డబ్బులుంటే చాలు అనుకునే వారు 99 శాతం మంది ఉంటారు. సంపాదించే కొద్దీ ఇంకా డబ్బులు కావాలనే కునే వాళ్లు మనకు ఎక్కువగా కనపడతారు.

Undi : ఉడతా ఉడతా హూచ్.. "ఉండి" టిక్కెట్ తూచ్.. ఎవరికి దక్కేనోచ్

కూటమి ఏర్పడిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో కొద్దో గొప్పో అసంతృప్తులున్నప్పటికీ ఉండి నియోజకవర్గం టీడీపీకి మాత్రం తలనొప్పిగా తయారైంది. ఉండి నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ కోసం ఇప్పుడు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరికి రాకపోయినా మిగిలిన వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

Big Family: వామ్మో ఒక కుటుంబంలో 2500 మంది... అందులో 1200 మంది ఓటర్లు

ఉమ్మడి కుటుంబాలు ఈరోజుల్లో అసలు ఉండవు. అలాగే పెళ్లి కావడమే కష్టం. పెళ్లి కాదు.. ఆ ఆసామి పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏకంగా ఐదుగురిని వివాహమాడాడు. అందరినీ ఒకే ఇంట్లో నివాసం ఉంచాడు. ఇక చూడండి.. ఆ ఐదుగురికి పిల్లలు పుట్టారు. వాళ్లు పెద్దోళ్లయితే.. వాళ్లకీ పెళ్లిళ్లు చేశాడు.

Kalvakuntla Kavitha : కవిత ఇంకా ఎన్నిరోజులు తీహార్ జైలులో ఉంటారో?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీ ముగియడంతో కవితను న్యాయస్థానంలో హాజరుపర్చగా ఆమెకుకు న్యాయస్థానం ఈ నెల 23వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh : అయ్యబాబోయ్.. ఏపీలో దంచికొడుతున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వడగాలుల తీవ్రత కూడా మొదలయింది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. నెల రోజుల పాటు వడగాలులు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

IPL 2024 : నేడు బెంగళూరుకు చావో రేవో

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు నేడు కీలక పోరుకు సిద్ధమయింది. వరస ఓటములతో ఆ జట్టు నిరాశలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో బలహీనంగా ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవడమూ కష్టంగానే కనిపిస్తుంది. విరాట్ కొహ్లితో పాటు ఒకరిద్దరు తప్ప ఎవరూ ఫామ్ లో లేకపోవడం, బౌలర్లు తరచూ విఫలం కావడంతో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

Vote : నేడు ఓటు హక్కు నమోదుకు ఆఖరి రోజు

వచ్చే నెల జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన వారు నమోదు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు. ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే వెంటనే ఓటు హక్కు పొందడానికి ఈ రోజు మాత్రమే ప్రయత్నించాలని ఎన్నిికల సంఘం అధికారులు వెల్లడించారు.

పోలీస్ క్యాంప్ పై మావోల దాడి

ఛత్తీస్‌గడ్‌ బీజాపూర్‌ జిల్లాలోని చుట్వాహిలోని పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టులు బాంబులతో దాడికి దిగారు. తెలంగాణ ఛత్తీస్‌గడ్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టలు బంద్‌ పాటిస్తున్న నేపథ్యంలో ఈ రకమైన దాడులకు మావోయిస్టులు దిగారు.




Tags:    

Similar News