April16-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
శ్రీరామనవమికి భధ్రాచలంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యాణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నేడు ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు. భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Bhadrachalam : భద్రాద్రిలో నేడు ఎదురుకోలు వేడుక
శ్రీరామనవమికి భధ్రాచలంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యాణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నేడు ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు. భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
Tadipathri : తాడిపత్రిలో ఈసారి తాడోపేడో అన్నట్లుగా ఉందిగా.. ఈసారి మాత్రం గెలుపు?
గత ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో సంచలనం నమోదయింది. దశాబ్దాలుగా ఏలిన జేసీ కుటుంబానికి కంచుకోటను కేతిరెడ్డి పెద్దారెడ్డి బద్దలు కొట్టగలిగారు. అప్పట్లో జగన్ వేవ్ తో అందరూ ఓటమిపాలయినట్లుగానే తాము ఓడిపోయామని జేసీ బ్రదర్స్ సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి ఇక్కడ పట్టు తమకు సడలలేదని నిరూపించారు.
Chandrababu : నేను చెప్పినట్లు తలాడించాల్సిందే.. ఎగరేయడానికి లేదు బాబాయ్.. బాబోయ్...బాబు మాస్టర్ మైండ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అంతా ఆయన అనుకున్నట్లుగానే జరుగుతుంది. కూటములతో కొంత ఇబ్బందులుంటాయని తొలుత భయపడినా.. అందరూ తన వాళ్లే కావడంతో స్మూత్ గా నడిపించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు.
UPPSC : ఎవరీ అనన్య రెడ్డి... ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్ ఎలా సాధ్యమయింది?
యూపీపీఎస్సీ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. పాలమూరు అంటే వలసలకు ప్రసిద్ధి. అలాంటి జిల్లాలో పుట్టిన చదవుల తల్లి అనన్య రెడ్డి. కేవలం తొలి ప్రయత్నంలోనే అనన్య రెడ్డికి సివిల్స్ లో ర్యాంకు వచ్చిదంటే ఆమె కష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Breaking : విజయవాడలో జగన్ పై దాడి కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. అతను సింగ్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఐదుగురు యువకులు జగన్ పై దాడిచేసిన వారి పేరును కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. సీసీఎస్ పోలీసులు వీరిని విచారిస్తున్నారు.
IPL 2024 : కావ్య బేబీ ఫీలింగ్స్ చూస్తే.. ఇన్ని వేరియేషేషన్లున్నాయా? ఉగ్గబట్టి...?
ఐపీఎల్ లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఈ బాదుడేంది సామీ అని అనిపించక మానదు. రెండు జట్లు ఎవరికీ ఎవరు తగ్గకుండా వీర విహారం చేశాయి. ఒకరికి ఒకరు తక్కువ కాదన్నట్లుగా మైదానంలో ఫ్యాన్స్ ను అలరించాయి.
Breaking : వైసీపీ నేత తోట త్రిమూర్తులకు బెయిల్
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ లభించింది. ఆయనకు ఈ కేసులో విశాఖ న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. తోట త్రిమూర్తులతో పాటు మరో ఆరుగురికి ఈ కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు 2.50 లక్షల జరిమానాను కూడా విధించింది.
Breaking : పవన్ కు బిగ్ రిలీఫ్... గాజు గ్లాసు గుర్తుపై
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గాజుగ్లాసు గుర్తుపై దాఖలయిన పిటీషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో పవన్ కు చాలా వరకూ ఊరట కలిగినట్లేనని చెప్పుకోవాలి. గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
Bhadrachalam : రాములోరి కల్యాణం లైవ్ టెలికాస్ట్ ఉంటుందా? లేదా?
సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారం పై అనుమానాలు కలుగుతున్నాయి. ఏటా భద్రచాలం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. దశాబ్దాలుగా లైవ్ టెలికాస్ట్ ను నిర్వహిస్తున్నారు. భద్రాచలం వెళ్లి సీతారాముల కల్యాణాన్ని చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూసి రాములోరి కల్యాణాన్ని తరిస్తారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించడంపై నీలినీడలు అలుముకున్నాయి.
IPL2024 : బ్యాట్ కు బంతి భారమయిందిగా... అసలు ఎటు పోతుందో తెలిస్తేగా.. అట్లా ఉంది మ్యాచ్
ఐపీఎల్ హిస్టరీని క్రియేట్ చేసుకున్న ఆ జట్టే మళ్లీ తిరగరాసింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తాను ఐపీఎల్ లో సాధించిన స్కోరును తానే అధిగమించి రికార్డును క్రియేట్ చేసింది. గతంలో ముంబయి జట్టు మీద 277 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఔరా అనినిపించుకుంది. కానీ నేడు అదే జట్టు బెంగళూరు రాయల్స్ మీద 287 పరుగులు చేసి నోరు వెళ్ల బెట్టేలా చేసింది.