17July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

నెల్లూరులో రొట్టెల పండగ ప్రారంభమయింది. ఈ పండగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నెల్లూరులో రొట్టెల పండగ కోసం ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వచ్చి తమ కోర్కెలు తీరాలని మొక్కులు మొక్కుకుంటారు. ఒక్కో కోరికకు ఒక్కో రొట్టెను ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది.

Update: 2024-07-17 11:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

నెల్లూరులో రొట్టెల పండగ ప్రారంభం

నెల్లూరులో రొట్టెల పండగ ప్రారంభమయింది. ఈ పండగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నెల్లూరులో రొట్టెల పండగ కోసం ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వచ్చి తమ కోర్కెలు తీరాలని మొక్కులు మొక్కుకుంటారు. ఒక్కో కోరికకు ఒక్కో రొట్టెను ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఏటా మొహరం సందర్భంగా రొట్టెల పండగను నిర్వహిస్తూ వస్తున్నారు.

KCR : కేసీఆర్ ముందున్న అతి పెద్ద సవాల్ అదేనట..గులాబీ పార్టీలో ఆగస్టు నెల టెన్షన్

అధికారంలో ఉన్నప్పడు కేసీఆర్ చూపించిన యాటిట్యూడ్ ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. నేతలు వరస పెట్టి వెళ్లిపోతుండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యమకాలంలో తన వెంట నడిచిన నేతలు మినహాయించి మధ్యలో తాను ఆదరించిన నేతలందరూ దాదాపుగా వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు.

Nara Lokesh : కేసీఆర్, జగన్ చేసిన తప్పులకు దూరంగా ఉండాలనే లోకేష్ ఈ నిర్ణయం?

రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రజలను నేరుగా కలిసేందుకు సమయం కేటాయించలేదు. కేసీఆర్ ప్రజాభవన్ కే పరిమితమయిపోగా, జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉండిపోయారు.

చిరుత మళ్లీ కనిపించడంతో.. భయాందోళనలో ప్రజలు

మహానందిలో మళ్లీ చిరుత కనిపించింది. గత కొద్ది రోజులుగా మహానంది క్షేత్రంలో చిరుత సంచారం స్థానికులతో పాటు భక్తులను భయాందోళనలకు గురి చేస్తుంది. తాజాగా రాత్రి మహానంది ఆలయ పరిసర ప్రాంతానికి వచ్చిన చిరుత అక్కడ ఉన్న పందిపై దాడి చేసింది. దీనిని స్థానికులు గుర్తించి వెంటనే పెద్దగా శబ్దాలు చేయగా చిరుత అక్కడి నుంచి అడవుల్లోకి పరుగులు తీసింది.

Chandipura Virus: చాందిపుర వైరస్ అంటే ఏంటి? ఎలా సోకుతుందో తెలుసా?

గుజరాత్ ను చాందిపుర వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గుజరాత్ లో బయటపడిన ఈ వైరస్ తో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన కలుగుతుంది. ఈ వైరస్ దోమలు, రెక్కల పురుగుల ద్వారా సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Breaking : సూర్యాపేట జిల్లాలో విషాదం.. నీటి గుంటలో పడి ముగ్గురి మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. క్వారీ గుంతలో పడి ముగ్గురు మరణించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు యువకులు ఒక బాలిక ఉన్నారని పోలీసులు తెలిసారు. క్వారీ గుంతల్లో ఈత కొట్టేందుకు వెళ్లిన వారు ఒక్కసారిగా లోతులోకి వెళ్లడంతో మరణించారని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.

Rain Alert : కుండపోతగా మూడు రోజులు భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జారీ

హైదరాబాద్ వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఐదు రోజుల పాలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రధానంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు భారీ వర్షాల దెబ్బకు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

Hyderabad : వీధికుక్కల దాడిలో గాయపడిన బాలుడి మృతి

హైదరాబాద్ లో వీధికుక్కలు పసి కూనల ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటి వరకూ అనేక మంది వీధి కుక్కల బారిన పడి మృత్యువాత పడినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కల బారిన పడి ఎందరో అమాయకులు బలి అవుతున్నారు.

కాలినడకన వెళుతున్న భక్తులపై దూసుకొచ్చిన ట్రక్కు.. నలుగురు స్పాట్ డెడ్

తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన వెళుతున్న భక్తులపై ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకు వచ్చిన ట్రక్కు కాలినడకన వెళుతున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో నలుగరు అక్కడికక్కడే మరణించారు.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకోండి

ఆంధ్రప్రదేశ్‌ ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకారంతోనే ఏపీ గట్టెక్కే అవకాశాలున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని, ఈ నెల 23న ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయం అందించాలని చంద్రబాబు అమిత్ షాను అభ్యర్థించారు.

Tags:    

Similar News