Big Breaking : మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు.. క్రిమినల్ కేసు నమోదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా అవినతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రైవేట్ కంపెనీ సీఈవో బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ వన్ నిందితుడి గా కేటీఆర్ గా ఏసీబీ నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపుతో కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదయింది. దీంతో కేటీఆర్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలిసింది.
మంత్రి వర్గం ఆమోదం లేకుండా...
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ హెచ్ఎండీఏ నుంచి యాభై రెండు కోట్ల రూపాయల నిధులను కంపెనీకి విడుదల చేశారని ఆరోపణలు వినిపించాయి. ఇది నిబంధనలకు విరుద్ధంగా చేశారని, మంత్రి వర్గం ఆమోదం లేకుండా కేవలం కేటీఆర్ మాత్రమే ఈ నిధులను విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై కేసు నమోదయింది. ఆయన ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉండటంతో ఆయనను అరెస్ట్ చేయడానికి కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతారు. తొలుత విచారణ పేరిట పిలిపించే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ కేటీఆర్ కు సంబంధించిన కేసు విషయమై చర్చకు రావడం, మంత్రులందరూ ఆయనను విచారించేందుకు ఓకే చెప్పడంతో చీఫ్ సెక్రటరీకి గవర్నర్ నుంచి వచ్చిన ఉత్తర్వులు పంపి అక్కడి నుంచి ఏసీబీకి పంపారు. అయితే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ రేస్ విషయంలో చర్చకు తాము సిద్ధమని ఆయన ప్రకటించారు.