టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు, ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, Rk Roja : ఖచ్చితంగా పోటీ చేస్తా

Update: 2023-12-19 12:47 GMT

 latest telugu news

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని.. 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 31న న్యూ ఇయర్‌కు స్పెషల్ ఈవెంట్లు పెట్టే పబ్‌లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేసినందుకు అదనపు రుణాలు పొందేందుకు 6 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు అనుమతిని మంజూరు చేసింది.

ఆ వీడియో తీసి రాహుల్ గాంధీ తప్పు చేశారా?

పార్లమెంటు వెలుపల తనను అనుకరించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మంగళవారం మండిపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ వెలుపల ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలు నవ్వుతూ అనుకరిస్తూ ఉండగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మిమిక్రీని చిత్రీకరించారు.

Rk Roja : ఖచ్చితంగా పోటీ చేస్తా

మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు నగరి నియోజకవర్గం టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారని రోజా మండి పడ్డారు. వారంతా అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారని ఆర్కే రోజా మండిపడ్డారు.

Parliament : సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి.. మరో 49 మందిపై వేటు

పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యుల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో మరో 49 మంది పార్లమెంటు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకూ ఉభయ సభల్లో సస్పెన్షన్ వేటు పడిన వారి సంఖ్య 140 దాటింది. పార్లమెంటులో జరిగిన దాడిపై విపక్షాలు ప్రశ్నించడంతో పాటు కేంద్ర హోం మంత్రి, ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వరస సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి.

Tirumala : వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ?

తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పది రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. డిసెంబరు 23న రాత్రి 1:45 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది.

20 కోట్లు.. సన్ రైజర్స్ కు న్యాయం చేస్తారంటారా?

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించాడు. మినీ వేలంలో కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. వేలం పాటలో కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల రికార్డు ధరతో చేజిక్కించుకుంది. కమిన్స్ కోసం సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు హోరాహోరీ తలపడ్డాయి.

AP BJP : ఇచ్చేది వారట.. తీసుకునేది అవతల వారట.. తాము తీసుకోబోమంటున్నారే

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది. వైసీపీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తులు చేస్తుంది. వైసీపీ అధినేత జగన్ ఎడా పెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు.

Gyanvapi : జ్ఞానవాపి వివాదంలో తీర్పు

జ్ఞానవాపి వివాదంలో ముస్లింలకు షాక్ తగిలంది. అలహాబాద్ హైకోర్టు ముస్లింలకు వ్యతిరేకంగా తీర్పు జెప్పింది. జ్ఞానవాపి మసీదు స్థంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న సివిల్ దావాపై అలహాబాద్ కోర్టు నేడు తీర్పు చెప్పింది.

కమిన్స్ రికార్డు బద్దలు.. మిచెల్ స్టార్క్ పై కోట్ల వర్షం

ఐపీఎల్ మినీ వేలంలో రికార్డులు నమోదవడమే కాకుండా.. ఆ రికార్డులు బద్దలు కూడా అయిపోతున్నాయి. పాట్ కమిన్స్ ను 20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకోగా.. మిచెల్ స్టార్క్ కోసం భారీగా బిడ్డింగ్ వార్ జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ కమిన్స్ కోసం ఊహించని విధంగా పోటీ పడ్డాయి.


Tags:    

Similar News