19May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఎయిర్‌ఇండియా విమానం ఇంజిన్ లో మంటలు వచ్చాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి కొచ్చి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గమనించిన పైలట్ వెంటనే బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.

Update: 2024-05-19 12:13 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్ లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్

ఎయిర్‌ఇండియా విమానం ఇంజిన్ లో మంటలు వచ్చాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి కొచ్చి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గమనించిన పైలట్ వెంటనే బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.

Malla Reddy : పాపం.. మల్లన్నకు ఎంత కష్టమొచ్చింది... మిల్క్ కాదన్నా.. అవి ల్యాండ్స్...?

తెలంగాణ రాజకీయాల్లో చామకూర మల్లారెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయనను రాజకీయాల్లో ఒక హాస్యనేతగానే చూస్తారు కానీ.. ఆయన ఆస్తులు చూసిన వారికి ఎవరికైనా అలా అనిపించదు. ఫక్తు పల్లెటూరి భాషలో.. ఆయన మాట్లాడే తీరు కొన్ని సార్లు ఆకట్టుకుంటున్నా.. మరికొన్ని సార్లు ఎబ్బెట్టుగానూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మెడికల్ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో అత్యధిక ఫీజులు తీసుకుంటున్నారని ఆరోపణలతో పాటు వేలాది ఎకరాలను భూమిని కబ్జా చేశారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటుంటారు.

IPL 2024 : ఈ ఐపీఎల్ సీజన్ లో పూర్తిగా డల్ అయింది పాండ్యా మాత్రమే.. ఎప్పుడూ లేనంతగా

ఐపీఎల్ పదిహేడో సీజన్ ముగింపుదశకు చేరుకుంది. ప్లే ఆఫ్ కు నాలుగు జట్లు చేరుకున్నాయి. ఫైనల్స్ కు ఏ జట్టు వెళతాయన్నది పక్కన పెడితే ఈ సీజన్ లో పూర్తిగా డల్ అయింది హార్ధిక్ పాండ్యా మాత్రమే. ఎందుకంటే సీజన్ ఆరంభం నుంచి పాండ్యాకు ఈ సీజన్ కలసి రాలేదు. ఆల్ రౌండర్ గా హార్ధిక్ పాండ్యాకు పేరు. ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ పాండ్యా ఉంటే కొంత జట్టుకు ధైర్యం అనిపించేలా ఉండేది.

IPL 2024 : ఈ ఆట ఆరంభం నుంచి ఏమయింది సామీ.. టెన్షన్ పెట్టారుగా?

ఐపీఎల్ ఆరంభంలో ఈసారి ఛాంపియన్ గా గెలుస్తుందని అంచనాలు వినిపించిన జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. అయితే వరస ఓటములతో ఆ జట్టు ఇక ప్లే ఆఫ్ కు కూడా చేరుకునే అవకాశాలు లేనట్లే కనిపించింది. ఎన్ని ఓటములు... ఎన్ని విమర్శలు... అసలు ఈ జట్టేందిరా సామీ... ఇలా తయారయింది అని ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. ఒక్క ఓటమిని అయితే తట్టుకుంటారు. వరస ఓటములను ఎవరు మాత్రం జీర్ణించుకుంటారు.

Ap Elections : బాలయ్యకు ఈసారి గట్టి పోటీ ఎదురైందా? అందుకు ఈ లెక్కలే చెబుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో పదిహేను రోజులు సమయం ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే అనేక రకాల విశ్లేషణలు ఏపీ రాజకీయాలపై వెలువడుతున్నాయి. ప్రధానంగా హాట్ సీట్లు ఏపీలో అనేకం ఉన్నాయి. ఇటు అధికార వైసీపీ, అటు కూటమి పార్టీల్లో అగ్రనేతలు ఎన్నికల బరిలో నిలిచారు. సహజంగా వారు పోటీ చేసే స్థానాలపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది.

తిన్నోళ్లకు తిన్నంత మటన్.. ఇక్కడకు వాళ్లకు మాత్రమే ప్రవేశం

తమిళనాడులో మాంసాహార ప్రియులకు రుచికరమైన వంటకాలతో భోజనాలను పెడతారు. ఇది ఏటా తమిళనాడులో జరుగుతుంది. ఈ జాతరకు కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మహిళలకు ప్రవేశం లేదు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలోని కరుప్పారై ముత్తయ్య ఆలయంలో ఏటా ఈ జాతర నిర్వహిస్తారు. దీనికి కిడా విరుందు అని కూడా పిలుస్తారు.

ఏబీకి పోస్టింగ్ పై కొనసాగుతున్న సస్పెన్స్.. బలమైన కారణమిదేనట

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెలాఖరకు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆయనకు మాత్రం ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను గత ప్రభుత్వం రెండు సార్లు సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు.

ఇకపై యాదాద్రిలో డ్రెస్ కోడ్ అమలు

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పని సరి చేస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఈ విషయాన్ని ఆలయ ఈవో కూడా ధృవీకరించారు.

Delhi : ఢిల్లీలో ఉద్రిక్తత.. బీజేపీ పార్టీ ముట్టడికి బయలుదేరిన ఆమ్ ఆద్మీపార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలతో ఢిల్లీలో ఉద్రిక్తత తలెత్తింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పార్టీ నేతలు,కార్యకర్తలు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ప్రశ్నించిన వారందరినీ జైల్లో పెడుతున్నారని, తమ పార్టీని అంతం చేసేందుకే పార్టీ నేతలపై వరసగా అక్రమ కేసులు పెడుతూ జైల్లోకి నెడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

Ap Elections : సిట్ దర్యాప్తు వేగవంతం.. రేపు సీఈసీకి నివేదిక సమర్పించే అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిట్ ను పోలింగ్ అనంతరం జరిగిన దాడులపై విచారణ కోసం నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సిట్ బృందం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీకి చేరుకుని విచారణ ముగించింది. స్థానిక అధికారుల నుంచి వివరాలను సేకరించింది.




Tags:    

Similar News