19July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-07-19 12:18 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

వరద ముంచెత్తింది.. అప్రమత్తమయిన అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. పెద్దవాగు దిగువ భాగం, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు

హైవేపై వెళుతున్నారా? అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే మరి

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా వాహనం విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Chandrababu : ఆ ఒక్క మంత్రి పదవిని చంద్రబాబు ఖాళీగా ఉంచింది ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంత్రిపదవులన్నీ చంద్రబాబు భర్తీ చేశారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి మంత్రి పదవి ఇచ్చారు. మిగిలిన మంత్రి పదవులన్నీ టీడీపీ తీసుకుంది. కూటమిలో లెక్కల ప్రకారమే మంత్రి పదవుల పంపిణీ జరిగింది. మిత్రపక్షాల నుంచి కూడా పెద్దగా వత్తిడి ఏం లేకపోవడంతో చంద్రబాబు తన కేబినెట్ ను స్వేచ్ఛగానే ఏర్పాటు చేయగలిగారు.

Rain Alert : ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Team India : శ్రీలంక టూర్ కు టీం ఇండియా స్కాడ్ ఇదే

శ్రీలంక పర్యటనకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు టీం ఇండియా ఆడనుంది. ఈనెల 27వ తేదీ నుంచి టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే రెండు జట్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కెప్లెన్లను వేర్వేరుగా నియమించింది. భారత్‌ టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరిస్తాడు.

Ys Jagan : మళ్లీ గ్రిప్ రావాలంటే జగన్ కు ఆషామాషీ కాదు... వ్యూహం మార్చాల్సిందేనా?

వైఎస్ జగన్ నాయకత్వంపై మళ్లీ నేతలకు, క్యాడర్ కు భరోసా కలగాలంటే శ్రమించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి కాదు. ఈసారి జగన్ ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే. అప్పటికాని ఆయన మళ్లీ గ్రిప్ అందదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇటీవల జరిగిన ఓటమితో క్యాడర్‌తో పాటు నేతలు కూడా బాగా కుంగిపోయి ఉన్నారు. ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారు.

Revanth Reddy : రేవంత్ అమెరికా పర్యటన ఖరారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరరాయింది. ఆగస్టు మూడో తేదీన ఆయన అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు రేవంత్ రెడ్డి అమెరికాలోనే పర్యటిస్తారు. డల్లాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Asad : ఎవరికీ భయపడేది లేదు.. బెదిరింపులకు లొంగేది లేదు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్ లు కూడా పెడుతూ తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అయితే ఇటువంటి బెదిరింపులకు తాను భయపడబోనని తెలిపారు.

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం...కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. రాజస్థాన్ లోని బికనీర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కును వెనక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హర్యానాలోని దబ్బాలీ వాసులుగా గుర్తించారు.

Punganur : పుంగనూరులో అదే టెన్షన్..నేడు కూడా మిధున్ రెడ్డి

పుంగనూరు లో‌ టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్రిక్తతలు తగ్గడం లేదు. నిన్నటి నుంచి రాళ్లు రువ్వుకోవడం, వాహనాలు ద్వసం చేయడం... నియోజకవర్గం లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మరోసారి సదుంకి పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రానున్నారు.అయితే మిధున్ రెడ్డి రాకను అడ్డుకుంటామని టిడిపి నేతల హెచ్చరికలు చేశారు. దీంతో మిథున్ రెడ్డి పర్యటన కు పోలీసులు అనుమతి లేదని తెలిపారు.


Tags:    

Similar News