టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

పేటీఎంకు కష్టాలు మరింతగా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన చర్యల కారణంగా తీవ్ర ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి నెలకొంది. కేవైసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున పేటీఎం పేమెంట్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి పేటీఎం ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Update: 2024-03-02 12:31 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Paytm: తప్పని కష్టాలు.. పేటీఎంకు రూ.5.49 కోట్ల జరిమానా

పేటీఎంకు కష్టాలు మరింతగా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన చర్యల కారణంగా తీవ్ర ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి నెలకొంది. కేవైసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున పేటీఎం పేమెంట్‌ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి పేటీఎం ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

నవ్వుతూ ఆమెతో ఫోటో.. కొన్ని గంటల తర్వాత అతడేమైపోయాడంటే

కోల్‌కతాలో 32 ఏళ్ల వ్యక్తిని అతడితో రిలేషన్ షిప్ లో ఉన్న మహిళ చంపేసింది. తన లైవ్-ఇన్ భాగస్వామిని కత్తితో పొడిచి చంపేసిందామె. అతని మరణానికి కొన్ని గంటల ముందు "కుటుంబం" అనే క్యాప్షన్‌తో మహిళ, ఆమె కొడుకుతో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. అందులో అతడు నవ్వుతూ కనిపించాడు.

ఫోటోలు సరిగా తీయలేదట.. ఫోటోగ్రాఫర్ ను ఏమి చేశారంటే?

బీహార్‌లోని దర్భంగాలో ఒక ఫోటోగ్రాఫర్ హత్యకు గురయ్యాడు. అతడి ఓ పుట్టినరోజు వేడుకకు వెళ్ళాడు. అతడి కెమెరా బ్యాటరీ డ్రైన్ అవ్వడంతో ఫోటోలు తీయలేకపోయాడు. దీంతో కోపం వచ్చిన బర్త్‌డే నిర్వాహకులు ఫోటోగ్రాఫర్ ను కాల్చి చంపారు. బాధితుడిని సుశీల్ సాహ్నిగా గుర్తించారు.

ఆ మూడు నియోజకవర్గాలపై సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌.. పంతం నెగ్గించుకుంటారా?

వచ్చే ఎన్నికల్లో మొత్తానికి మొత్తం అంటే 175 సీట్లను దక్కించుకుంటామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో సీట్లన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మూడు స్థానాలపై కన్నేసింది.

High Blood Pressure: రక్తపోటు పెరిగితే బ్రెయిన్‌ స్ట్రోక్, గుండెపోటు వస్తుందా?

అధిక రక్తపోటు రోజురోజుకు సాధారణ సమస్యగా మారుతోంది, దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒత్తిడి పెరగడం, బయటి ఫుడ్‌ తినడం, తక్కువ శారీరక శ్రమ రక్తపోటును పెంచుతుంది. తక్కువ రక్తపోటు కంటే అధిక రక్తపోటు చాలా సాధారణం. కానీ ఎక్కువ కాలం దానిని నిర్లక్ష్యం చేస్తే, పెరిగిన రక్తపోటు నియంత్రణలో ఉండకపోతే అప్పుడు అనేక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవచ్చు.

మహాసేన రాజేష్ సంచలన ప్రకటన.. నెక్ట్స్ ఎవరు?

తెలుగుదేశం-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించినప్పుడు ఓ వ్యక్తి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమిటంటే 'మహాసేన రాజేష్'. పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే మహా సేన రాజేష్ అర్హుడే కాడంటూ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మహాసేన రాజేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించమని పలువురు బహిరంగంగా విమర్శించారు.

బీజేపీ నేత దారుణ హత్య.. పెళ్ళికి వెళ్లి వస్తుండగా!!

భారతీయ జనతా పార్టీ నేతను అతి దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బీజేపీ నాయకుడిని శుక్రవారం నరికి చంపినట్లు అధికారులు తెలిపారు. అతడిని చంపింది మావోయిస్టులని అనుమానిస్తూ ఉన్నారు.

వామ్మో.. ఈరోజు హైదరాబాద్ లో ఉష్ణోగ్రత ఎలా ఉందంటే?

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) లిమిట్స్ లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. మార్చిలోకి అలా అడుగుపెట్టామో లేదో హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు బేగంపేట (38.6 ° C), సరూర్‌నగర్ (38.3 ° C) లలో 38 ° సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. కార్వాన్ (37.7°C), జూబ్లీహిల్స్ (37.6°C), యూసుఫ్‌గూడ (37.6°C)లు GHMC పరిధిలోని టాప్ 5 హాటెస్ట్ ఏరియాల్లో ఉన్నాయి.

ఉపాసన పాదాలకు మసాజ్ చేసిన రామ్ చరణ్

సూపర్‌స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని తరచుగా అంటూ ఉంటారు. ఇప్పుడు, ఒక వైరల్ వీడియోలో.. రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొణిదెల పాదాలకు మసాజ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఇంటర్నెట్ ఈ జంటను చూసి 'కపుల్ గోల్స్' అంటూ ప్రశంసించారు. వైరల్ వీడియోలో..

అనంత అంబానీ-రాధిక పెళ్లికి ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం, ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ త్వరలో రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి వివాహానికి ముందు జరిగే వేడుకలు మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగుతున్నాయి.


Tags:    

Similar News