2August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

నీట్ యూజీ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసన తీర్పు వెలువరించింది. నీట్ పరీక్ష లీకేజీ కేవలం బీహార్ కే పరిమితమయిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా జరగలేదని తెలిపింది.

Update: 2024-08-02 13:11 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : నీట్ పరీక్షపై సుప్రీం సంచలన తీర్పు

నీట్ యూజీ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసన తీర్పు వెలువరించింది. నీట్ పరీక్ష లీకేజీ కేవలం బీహార్ కే పరిమితమయిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా జరగలేదని తెలిపింది.

Kethireddy : కేతిరెడ్డికి ఏమయింది? జగన్ పై తిరుగుబాటుకు సిద్ధమయ్యారా?

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమి తర్వాత పార్టీకి ఇబ్బందికరంగా మారారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పైనే విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో జగన్ కూడా ఒకరు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అధినాయకత్వాన్ని తప్పుపట్టేందుకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు?

VH : వీహెచ్ కోసం ఆ పదవి ఎదురు చూస్తుందా? అందులో నిజమెంత?

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కామ్ అయిపోయారు. ఆయన ఏదో ఆశించి తన పెదవులకు తాళం వేసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రాజ్యసభ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయన ఇటీవల కాలంలో మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

Kerala Landslide : శిధిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడిన నలుగురు... మృత్యుంజయులే కదా?

కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి సహాయక చర్యలు ప్రారంభించినా రెండు రోజుల నుంచే అవి ఊపందుకున్నాయి. మొదటి రెండు రోజుల పాటు వర్షం కురుస్తుండటం, ఘటన స్థలికి వెళ్లే వంతెన కూలి పోవడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.

Paris Olympics : గురి తప్పలేదు... మరో పతకం గ్యారంటీయేగా?

పారిస్ ఒలింపిక్స్ లో మూడు పతకాలను సాధించే దిశగా షూటర్ మను బాకర్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రెండు కాంస్య పతకాలను మనుబాకర్ కైవసం చేసుకున్నారు. తాజాగా మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ కాంపిటీషన్ లో టాప్ 2లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించారు. ఇక శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ లో తొుత ప్రిసిషన్ రౌండ్ లో 294 పాయింట్లు సాధించి టాప్ 3లో మనుబాకర్ నిలిచారు.

సీఎం ఇంటికి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను కలసి కాసేపు ముచ్చటించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో కొనసాగే అవకాశముందన్న చర్చ జరుగుతుంది. నిన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు కలసి చర్చలు జరిపిన నేపథ్యంలో నేడు సీఎంను కలసి ఆయనతో బ్రేక్ ఫాస్ట్ చేశారు.

ఇటలీలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

ఇటలీలో భూకంపం సంభవించింది. ఇటలీలోని కాలబ్రియా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు.

Stray Dogs : పది వీధి కుక్కల దాడి.. వృద్ధురాలి మృతి

వీధికుక్కల బెడద ఎక్కువయింది. చిన్నారులే కాదు పెద్దలు కూడా వీధి కుక్కల బారిన పడి మరణిస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆమె మరణించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాడ్ మండలం సేవలాల్ తండాలో ఈ ఘటన జరిగింది.

Road Accident : ఓవర్ స్పీడ్ యువకుడి ప్రాణం తీసింది

అతి వేగం ఒక యువకుడి ప్రాణం తీసింది. కారు చేతిలో ఉంటే ఇక యాక్సిలేటర్ పై కాలు తీయరు నేటి యువకులు. ఎంత స్పీడ్ వెళితే అంత హీరోయిజం. అదే చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదాబాద్ లోని రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో దానం ఘాటు వ్యాఖ్యలు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఏయ్ నోర్ముయ్ అంటూ రాయలేని భాషలో ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News