టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

RRR రికార్డు బ్రేక్ చేసిన సలార్..,పవన్ కళ్యాణ్ ఆరోజు తీసుకున్న నిర్ణయం ఓ సంచలనం, తెలంగాణ అప్పు అంత ఉందా?

Update: 2023-12-20 13:23 GMT

 latest telugu news

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Nagarjuna : నాగార్జునని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్..

తెలుగు బిగ్‌బాస్ షోకి నాగార్జున హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఏడు సీజన్లు పూర్తి కాగా.. ఐదు సీజన్స్ కి నాగార్జునే హోస్టుగా వ్యవహరించారు. ఇక ఈ షో పై ఎన్ని విమర్శలు వస్తున్నా, అభ్యంతరాలు వినిపిస్తున్నా.. బిగ్‌బాస్ నిర్వాహుకులు నడిపిస్తూనే వస్తున్నారు.

తెలంగాణ అప్పు అంత ఉందా?

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ. 6,71,757 కోట్ల అప్పులో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు. బుధవారం నాడు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.

అయ్యప్ప దర్శనానికి అన్ని గంటలా!!

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోడానికి భక్తులు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి భారీగా అయ్యప్ప మాలలు ధరించారు భక్తులు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతూ ఉండడం.. కేరళ ప్రభుత్వం నిర్వహణకు సంబంధించి అన్ని విషయాలలోనూ చేతులు ఎత్తేయడంతో అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి.

ఆ ఆరోపణల్లో నిజం లేదు: హరీష్ రావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. చూపించిన లెక్కలన్నీ తప్పులేనని చెప్పారు. ఈ శ్వేతపత్రాన్ని ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారని తెలిపారు.

రష్మిక డీప్ ఫేక్.. ఆ నలుగురు అరెస్ట్

నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డీప్‌ఫేక్‌ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో నలుగురు నిందితుల్ని గుర్తించారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్‌ చేసినట్టు గుర్తించామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు రష్మిక డీప్‌ఫేక్ వీడియోను అప్‌లోడ్ మాత్రమే చేశారని, అయితే వీడియోను రూపొందించడంలో వారి ప్రమేయం లేదని ఆరోపించారు.

ఎంతో ఆనందపడుతున్న వైఎస్ షర్మిల

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల తన కుమార్తె, కుమారుడు సాధించిన ఘనతకు ఉప్పొంగిపోయారు. ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ చదువులో మైలురాళ్లను అధిగమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అందులో తన ఇద్దరు పిల్లలతో షర్మిల ఉన్న ఫోటోను పోస్టు చేశారు.

పవన్ కళ్యాణ్ ఆరోజు తీసుకున్న నిర్ణయం ఓ సంచలనం

టీడీపీ యువగళం విజయోత్సవ సభలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని.. రాష్ట్రం బాగుండాలనే దిశగా పవన్ అడుగులు వేశారని అన్నారు. రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశాక పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఓ సంచలనమని అన్నారు.

కాకినాడ తీరంలో భారీ పరిశ్రమ.. 5000 మందికి ఉద్యోగాలు

కాకినాడ తీరంలో భారీ పరిశ్రమ సిద్ధమవుతూ ఉంది. కాకినాడ అరబిందో సెజ్ లో అరబిందో అనుబంధ సంస్థ లైఫియస్ ఫార్మా రూ. 2 వేల కోట్లతో భారీ పరిశ్రమ నిర్మిస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. లైఫియస్ ఫార్మా ఇండస్ట్రీ పెన్సిలిన్- జి ఉత్పత్తి చేయడానికి రూ.2 వేల కోట్లతో కాకినాడలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది..

Pallavi Prashanth : నన్ను నెగిటివ్ చేస్తున్నారంటూ పల్లవి ప్రశాంత్ వీడియో..

తెలుగు బిగ్‌బాస్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ ని అందుకున్నాడు. ఇక టైటిల్ అందుకున్న బిగ్‌బాస్ నుంచి బయటకి ప్రశాంత్ కి తన బహిమానులు ఘానా స్వగతం పలికారు. ఒక సినిమా స్టార్ కి వచ్చినంత జనసంద్రం పల్లవి ప్రశాంత్ ముందు కనిపించింది.

Salaar : RRR రికార్డు బ్రేక్ చేసిన సలార్..

Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్‌షిప్ కథాంశంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మూవీ 'సలార్'. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, హౌస్ ఫుల్ కావడం కూడా జరిగిపోయింది.


















Tags:    

Similar News