April24-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తైవాన్ లో భారీ భూకంపాల దెబ్బకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కూడా భూకంపం వచ్చింది. ఈ భూకంపం రెండు వందల సార్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పెద్ద స్థాయిలో భూకంపం రాకపోవడంతో ప్రజలు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Earth Quake : తైవాన్ లో వరస భూకంప ప్రకంపనలు
తైవాన్ లో భారీ భూకంపాల దెబ్బకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కూడా భూకంపం వచ్చింది. ఈ భూకంపం రెండు వందల సార్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పెద్ద స్థాయిలో భూకంపం రాకపోవడంతో ప్రజలు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
KCR and Ys Jagan : కేసీఆర్ కామెంట్స్ జగన్ కు నష్టం తెస్తాయా? అదనపు ఓట్లు తెచ్చిపెడతాయా?
KCR and Ys Jagan :కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు ఏమేరకు ఉపయోగపడతాయన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో నడుస్తుంది. నిన్న ఒక టీవీ లైవ్ షోలో ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని తనకు సమాచారం ఉందని చెప్పడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా పందొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది.
IPL 2024 : భారీ లక్ష్యం కంటిముందున్నా చేతులు వణకలేదు.. బ్యాట్ పదును తగ్గలేదు
ఐపీఎల్ లో శతకాలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. టీ 20 లలో సెంచరీ చేయడమంటే ఆషామాషీ కాదు. ఎంత వేగంగా బంతులను బౌండరీకి, సిక్సర్లకు పంపగలిగితేనే సెంచరీ సాధ్యమవుతుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ మధ్య జరగిన మ్యాచ్ లోనూ ఇరు జట్లలో సెంచరీలు నమోదు చేసి మరో రికార్డు క్రియేట్ చేశారు.
IPL 2024 : హైదరాబాద్ ను ఆపడం ఎవరి తరం? దూసుకొస్తున్న ఆరెంజ్ ఆర్మీ
ఈ ఐపీఎల్ సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా దిగిన జట్టు హైదరాబాద్ సన్ రైజర్స్. అసలు ఈ జట్టు మీద యాజమాన్యానికే నమ్మకం లేనట్లుగా మొన్నటి వరకూ ఉండేది. కానీ కెప్టెన్సీని, జెర్సీని మార్చడంతో ఒక్కసారిగా ఆ జట్టు ఐపీఎల్ లో దూసుకుపోతుంది. ప్రత్యర్థి జట్టుకు నిద్రపట్టనివ్వడం లేదు. పొరపాటున ఆరెంజ్ ఆర్మీకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇక బాదుడే.. బాదుడు. రికార్డుల మీద రికార్డులు. తమ రికార్డులు తమే చెరిపేస్తున్న జట్టు ఇది. 277, 272, 287, 266 ఇలా పేరున్న జట్లపై పరుగుల మోత మోగించింది.
TDP : తమ్ముళ్లూ ఇక్కడ వెయిటింగ్... మ్యానిఫేస్టో రెడీ..ముహూర్తం కోసమేనట
తెలుగుదేశం పార్టీ అధినేత మ్యానిఫేస్టో విడుదలకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే ఉమ్మడి మ్యానిఫేస్టోను మోదీ, పవన్, చంద్రబాబు కలసి విడుదల చేయాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. మోదీ చేతుల మీదుగా ఏపీలో ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేయడానికి అంతా రెడీ చేసినట్లు సమాచారం.
kalvakuntla kavitha : బెయిల్ పై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. మే ఆరో తేదీన తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన కేసులో కవిత తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ వేశారు.
Telangana Inter Results 2024: సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా ఫస్ట్
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ ఇయర్ లో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం 60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్ఠానంలో నిలిచింది.
Telangana : రికార్డు బ్రేక్.. తెలంగాణలో 18 రోజుల్లో ఎన్ని బీర్లు తాగేశారంటే?
ఎండలు మండి పోతున్నాయి. మందు బాబులు బీర్లు తాగేస్తున్నారు. ఎండ వేడిమితో పాటు వడగాలులు కూడా తీవ్రంగా ఉండటంతో బీర్లను ఇష్టమొచ్చినట్లు తాగేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం కేవలం పద్దెనిమిది రోజుల్లోనే 670 కోట్ల రూపాయల బీర్ల విక్రయాలు తెలంగాణలో జరిగాయి. అంటే ఏ స్థాయిలో బీర్లు తాగుతున్నారో ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు.
KCR : నేటి నుంచి జనంలోకి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి బస్సు యాత్రతో జనం బాట పట్టనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వరసగా పదిహేడు రోజుల పాటు ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. రోడ్ షోలతో పాటు బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రజలను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Holidays : నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకూ విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వేడి గాలుల తీవ్రత కూడా ఈ ఏడాది ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది వేసవి సెలవులు యాభై రోజులు ఇచ్చినట్లయింది.