30 July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రికార్డును నెలకొల్పాయి. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి పదిహేడు గంటల పాటు ఏకబిగిన సమావేశాలు జరిగాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభమయిన సమావేశాలు నేటి తెల్లవారు జామున 3.15 గంటల వరకూ కొనసాగాయి.

Update: 2024-07-30 12:00 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Telangana : రికార్డును బ్రేక్ చేసిన టీఎస్ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రికార్డును నెలకొల్పాయి. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి పదిహేడు గంటల పాటు ఏకబిగిన సమావేశాలు జరిగాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభమయిన సమావేశాలు నేటి తెల్లవారు జామున 3.15 గంటల వరకూ కొనసాగాయి.

Telangana : సీజనల్ వ్యాధులతో జనం బెంబేలు.. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిట

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. అనేక మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. టైఫాయిడ్, డెంగీ వంటి రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది జ్వరపీడితులున్నారని గుర్తించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడిపోతున్నాయి.

Land Slides : నిద్రమత్తులో ఉండగానే మృత్యువు తలుపుతట్టింది

భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇప్పటికే 35 మంది వరకూ మరణించారు. ఈ శిధిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు వర్షం ఆటంకంగా మారింది.

Mahendra Singh Dhoni : అప్పుడే మైదానంలో ధోని కనిపిస్తాడట.. లేకపోతే లేదట

మహేంద్ర సింగ్ ధోనీ.. ఎంత వయసు పెరిగినా.. మైదానంలో ధోనీ ఉంటే చాలు ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానులున్నారు. మ్యాచ్ ఓడిపోతున్నా సరే ధోనీ మైదానంలో బ్యాట్ తో కనిపిస్తే చాలునని ఫ్యాన్స్ భావిస్తుంటారు. ఇప్పటికీ తరగని క్రేజ్ ఒక్క మహేంద్రుడికి మాత్రమే ఉంది.

Revanth Reddy : ఇచ్చిన మాటకు కట్టుబడి అనుకున్నట్లుగానే ఆగస్టు 15లోపు రైతులను రుణవిముక్తులను చేస్తాం

తెలంగాణలో ఉన్న రైతులకు రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన రెండో విడత నిధులను విడుదల చేశారు. రెండో విడతగా 1.50 లక్షల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం

ఒలింపిక్స్ లో భారత్ మరో పతాన్ని సాధించింది. మనుబాకర్, సరబ్ జోత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. మిక్స్‌డ్ ఈవెంట్ లో ఈ పతకం లభించింది. ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించిన మనుబాకర్ రికార్డు సృష్టించింది.

Kerala : వాయనాడ్ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

వాయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటి వరకూ 19 మృతదేహాలను బయటకు తీశారు. కేరళలో భారీ వర్షాలకు వాయనాడ్ లో జరిగిన ఈ దుర్ఘటనలో కొండచరియలు విరిగిపడటంతో అటువైపు ప్రయాణిస్తున్న వారు అందులో ఇరుక్కుపోయారు.

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాద స్థాయి కి దిగువకు వచ్చిందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్న కొద్ది గంటల్లోనే నీటి మట్టం మళ్ళీ పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో తగిన చర్యలు ప్రారంభించారు.

Andhra Pradesh : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పుస్తకాల పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పుస్తకాలను సిద్ధం చేసింది. జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి ఇంటర్ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 1,08,619 మంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

Telangana : రైతులకు గుడ్ న్యూస్ నేడే రెండో విడత రుణమాఫీ

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులకు రుణమాఫీ చేయనుంది. రెండో విడతగా రుణమాఫీ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభ ప్రాంగణంలో 1.50 లక్షల రూపాయల రుణాలను మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. 1.50 లక్షల రూపాయల వరకూ ఉన్న రుణమాఫీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది.


Tags:    

Similar News