28 July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

శనివారం ధర్మపురిలో జగిత్యాల పోలీసులు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) బాటిళ్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. 6 లక్షల విలువైన 2019.57 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశారు. ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019.57 లీటర్ల IMFL మద్యాన్ని సీజ్ చేసి 117 కేసులు నమోదు చేశారు.

Update: 2024-07-28 12:41 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Liquor Destroy: ఆ దృశ్యం చూసి మందుబాబుల హృదయాలు ద్రవించిపోయాయి

శనివారం ధర్మపురిలో జగిత్యాల పోలీసులు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) బాటిళ్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. 6 లక్షల విలువైన 2019.57 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశారు. ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019.57 లీటర్ల IMFL మద్యాన్ని సీజ్ చేసి 117 కేసులు నమోదు చేశారు.

Who Is Manu Bhaker: ఎవరీ మనూ భాకర్

హర్యానా దేశానికి ఎంతో అత్యుత్తమ అథ్లెట్లను అందించింది. బాక్సర్లు, రెజ్లర్లకు కేరాఫ్ గా నిలిచింది. అయితే మను భాకర్ మాత్రం చిన్నప్పుడు 'తంగ్ టా' అనే మార్షల్ ఆర్ట్స్‌లో రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. అయితే భాకర్ చివరికి షూటింగ్‌ ని ఎంచుకుంది.

Mohith Reddy: మోహిత్ రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు.. బయటకొచ్చాక చేసిన సవాల్ ఇదే!!

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలోని పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీయూ పీఎస్‌కు తరలించి, కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు కండీషన్ పెట్టారు.

PV Sindhu ParisOlympics: మొదలైన సింధు మెడల్ వేట

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత షట్లర్ పివి సింధు ఒలింపిక్స్ తొలి రౌండ్ లో విజయాన్ని అందుకుంది. మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్‌పై వరుస గేమ్‌ల విజయంతో పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ వేటను మొదలుపెట్టింది. మూడో ఒలింపిక్ పతకం కోసం బరిలో దిగిన సింధు గ్రూప్ మ్యాచ్‌లో 21-9 21-6తో విజయాన్ని అందుకుంది.

YS Sharmila: సిగ్గు.. సిగ్గు అంటున్న షర్మిల.. ఎందుకంటే?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీఅసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత హోదాలోనే సభకు హాజరవుతానంటూ వైఎస్ జగన్ చెప్పడం నిజంగా సిగ్గు చేటు అని షర్మిల ధ్వజమెత్తారు.

Kamindu Mendis: రెండు చేతులతో బౌలింగ్ వేయడం చూసి భారత బ్యాట్స్మెన్ షాక్

పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్లు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ వేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. యువ స్పిన్నర్ అరుదైన బౌలింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

TFCC తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షులు ఎవరంటే?

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీ.ఎఫ్.సీ.సీ.) నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ గెలిచారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విశాఖకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి డిస్ట్రిబ్యూటర్లు పోటీలో నిలిచారు.

Anakapalle: కాలువ‌లో దూకిన యువ‌తిని బయటకు తీసుకొచ్చి అత్యాచారం

అన‌కాప‌ల్లి జిల్లాలో మనస్తాపంతో కాలువ‌లో దూకిన యువ‌తిని కాపాడిన యువ‌కుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన చోటు చేసుకుంది. అన‌కాప‌ల్లి ప‌ట్టణానికి చెందిన 19 ఏళ్ల యువ‌తి ఎస్.రాయ‌వ‌రం మండ‌లం ధ‌ర్మవ‌రం గ్రామానికి చెందిన స్నేహితురాలు, మ‌రో యువ‌కుడితో క‌లిసి ద్విచ‌క్రవాహ‌నంపై సింహాచలం వెళ్లారు.

Reels Effect: రైలు పట్టుకుని రీల్స్ కట్ చేస్తే కాళ్ళు కట్

సోషల్ మీడియాలో లైక్స్ కోసం స్టంట్స్ చేసే వారందరికీ ఈ వీడియో ఓ గుణపాఠం లాంటిది. ట్రైన్ ను పట్టుకుని ప్రమాదకరమైన స్టంట్స్ చేసే ఓ యువకుడికి ఊహించని ప్రమాదం జరిగింది. ముంబై యువకుడు ఫర్హత్ ఆజం షేక్ ప్రమాదకరమైన రైలు స్టంట్ చేస్తూ ఒక చేయి, కాలును కోల్పోయాడు. కదులుతున్న లోకల్ ట్రైన్‌కు పట్టుకుని అతడు చేసిన వీడియో వైరల్ అయింది.

Telangana Governor: తెలంగాణకు కొత్త గవర్నర్.. ఎవరంటే?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు గవర్నర్ లను నియమిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా చేయగా, మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిబాహౌ బాగ్డే, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ గంగ్వార్, బీజేపీ సీనియర్ నేత ఓపీ మాథుర్, మైసూర్ మాజీ ఎంపీ సీహెచ్ విజయశంకర్ లకు గవర్నర్ గా అవకాశం దక్కింది.


Tags:    

Similar News