April29-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత కోసం వేట కొనసాగుతుంది. అయితే చిరుత జాడ కనిపించినా అది మాత్రం బోనులో చిక్కలేదు. గత రెండు రోజుల నుంచి అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాలు పెట్టారు. డ్రోన్ల ద్వారా చిరుత జాడ కోసం వెదుకుతున్నారు.

Update: 2024-04-29 12:29 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

‌Hyderabad : అదిగదిగో చిరుత.. కనిపించినట్లే కనిపించి.. అలా వెళ్లిందే

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత కోసం వేట కొనసాగుతుంది. అయితే చిరుత జాడ కనిపించినా అది మాత్రం బోనులో చిక్కలేదు. గత రెండు రోజుల నుంచి అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాలు పెట్టారు. డ్రోన్ల ద్వారా చిరుత జాడ కోసం వెదుకుతున్నారు.

Chandrababu : ఈసారి నమ్ముతారా.. విశ్వాసమే ఈసారి అసలు సమస్యగా మారిందా?

ఎన్టీఏ కూటమి రేపు ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల చేయనుంది. అయితే ఈ మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందన్న దానిపై ఇప్పటికే చర్చోప చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ తన మ్యానిఫేస్టోను విడుదల చేసింది. అమలయ్యే హామీలను మాత్రమే తాము మ్యానిఫేస్టోలో చేర్చామని, గత ఎన్నికల మ్యానిఫేస్టోలో 99 శాతం అమలు చేశామని, ఈసారి కూడా వందకు వంద శాతం అమలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ పదే పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వెళుతున్నారు.

Ys Bharathi : వైఎస్ కుటుంబంలోచీలిక.. పులివెందులలో పోరు పీక్ కు చేరుకుందిగా

నిన్నటి నుంచి పులివెందులలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన భర్తను మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఆమె ప్రచారం నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. పులివెందులలో తన భర్త జగన్ కు మద్దతుగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Ys Jagan : బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే

సాధ్యం కాని హామీలతో చంద్రబాబు నాయుడు మరోసారి మీ ముందుకు వస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చోడవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టడమేనంటూ వ్యాఖ్యానించారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే వృధా అయినట్లుగా చంద్రబాబు కు ఓటేస్తే గోవిందా.. గోవిందా.. అనాల్సిందే.

Breaking : స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు.. ఇరవై ఐదు నియోజకవర్గాల్లో

నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరిగింది. గాజు గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థులను టెన్షన్ పెడుతుంది. మచిలీపట్నం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ గా గుర్తించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నారు.

Congress : కాంగ్రెస్ కండువా కప్పేసుకున్న గుత్తా

తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాలో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో వెళ్లారు. గుత్తా ఇంటికి వెళ్లి పార్టీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

Loksabha Elections : నేడు ఆరోదశ ఎన్నికలకు నోటిఫికేషన్

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆరో దశ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఏడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుంది. ఆరోదశ నోటిఫికేషన్ లో ఉన్న ఏడు రాష్ట్రాలకు సంబందించి పోలింగ్ మే 25వ తేదీన జరగనుంది.

నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.. రెబల్స్ బెడదతో

నామినేషన్లకు ఉపసంహరణకు చివరితేదీ నేడు కావడంతో రాజకీయ పార్టీల నేతల్లో గుబులు పట్టుకుంది. అనేక నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా అనేక మంది బరిలో ఉన్నారు. వీరి నామినేషన్లను ఉపసంహరించడానికి పార్టీ అగ్రనేతలు కూడా అనేక ప్రయత్నాలు చేశారు. ఈరోజునామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు కావడంతో ఈరోజు ఉపసంహరించుకోకుంటే వారంతా రెబల్స్ గా మారిపోయినట్లే.

Big Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

చత్తీస్‌గడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టడంతో వ్యానులో ఉన్న తొమ్మిది మంది మరణించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pensions : పెన్షన్ నిర్ణయం.. ప్రతిపక్షాలకు శాపంగా మారనుందా?

పెన్షన్ల పంపిణీ మరోసారి జగన్ కు ప్లస్ గా మారనుంది. ఇంటికి తెచ్చే పింఛన్లు బ్యాంకుల్లో జమ చేస్తుండటం ఇందుకు కారణమని చెప్పాలి. వాస్తవానికి ఫిబ్రవరి పింఛను వరకూ ఇంటికి తెచ్చి నగదును వాలంటీర్లు చెల్లించారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవ్వాతాతలు తమ పింఛను మొత్తాన్ని ఇంటివద్దనే అందుకున్నారు.


Tags:    

Similar News