టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఈ భామలకే ఎక్కువ క్రేజ్, వైఎస్‌ షర్మిల వెంట నడుస్తా... అయోధ్యకు రావద్దని చెప్పేసిన ప్రధాని మోదీ, నటి జయప్రద మిస్సింగ్..

Update: 2023-12-30 13:00 GMT

 latest top 10 telugu news

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు అందించారు. డిసెంబర్ 23న గిగ్ వర్కర్స్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు.

Post Office 2023: ఈ ఏడాది పోస్టాఫీసు స్కీమ్‌లో వచ్చిన మార్పులు

ఇక పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ లిమిట్‌ని పెంచింది. గతంలో పర్సనల్‌ అకౌంట్‌ లిమిట్‌ రూ.4 లక్షలుగా ఉండేది. ఈ ఏడాదిలో దాన్ని రూ.9 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

ఆరోజు అయోధ్యకు రావద్దని చెప్పేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించారు. అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు మోదీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి ఆరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రధాని ప్రారంభించారు.


Saindhav: సెన్సార్ పూర్తీ చేసుకున్న వెంకటేష్ 'సైంధవ్'

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. విక్టరీ వెంకటేష్- శైలేష్ కొలను కాంబినేషన్ లో వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌ దక్కింది. ఈ చిత్రం జనవరి 13న విడుదలకు సిద్ధంగా ఉంది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75 వ చిత్రంగా సైంధవ్ రావోతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ అందించారు.

Jayaprada : నటి జయప్రద మిస్సింగ్.. పోలీసులు గాలింపు..

సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద కనిపించడం లేదు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అసలు విషయం ఏంటంటే, 2019 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సమయంలో జయప్రద.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారని ఆమె పై రెండు కేసులు నమోదు అయ్యాయి.


వైఎస్‌ షర్మిల వెంట నడుస్తా: ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ షర్మిలతోనే నా రాజకీయ ప్రయాణం అని స్పష్టం చేశారు.. వైఎస్‌ షర్మిల రాజకీయాలపై తన నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తానని అన్నారు.

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. హైదరాబాద్ లో విషాదం

హైదరాబాద్ నగరంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. కారు నడుపుతుండగా గుండెపోటుకు గురైన ఓ డ్రైవర్ తన సీటులోనే తుదిశ్వాస వదిలాడు. ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి వెళుతుండగా డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. చాంద్రాయణగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అవును.. ఆ స్టార్ క్రికెటర్ దోషిగా తేలాడు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్‌ లామిచానేని(Lamichanne)ఖాట్మండూ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ కాదని వెల్లడించింది.

Sunlight: సూర్యరశ్మి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

శీతాకాలంలో చలినుంచి కాపాడుకోవడానికి చాలామంది బయటకు కూడా వెళ్లరు. ఒక వేళాల్సి వస్తే స్వెట్టర్లు, మంకీక్యాప్ పెట్టుకొని వెళ్తారు. ఎండ మాత్రం శరీరంపై పడనివ్వరు. సూర్యరశ్మిని దాదాపుగా నివారించే పరిస్థితికి చేరుకుంటున్నారు. కానీ సూర్యరశ్మి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

2023 Rewind : మెయిన్ హీరోయిన్ కంటే ఈ భామలకే ఎక్కువ క్రేజ్ వచ్చింది..

ఈ ఏడాదిలో వచ్చిన సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కంటే పక్కన ముఖ్య పాత్రలు చేసిన భామలకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. యూత్ అంతా అసలు హీరోయిన్ ని పక్కన పెట్టేసి.. ఈ ముద్దుగుమ్మలకు మనసు ఇచ్చేస్తున్నారు. మరి ఆ భామలు ఎవరో ఓ లుక్ వేసేయండి.


Tags:    

Similar News