April30-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయం పై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తాము పొత్తులో ఉన్నందునే కొన్ని స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నామని, అందుకోసమే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని, ఫ్రీ సింబల్ అని చెప్పి జనసేన పోటీ చేయని మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించడంపై జనసేన సవాల్ చేసింది.

Update: 2024-04-30 13:28 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

గుర్తుపై హైకోర్టుకు జనసేన

గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయం పై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తాము పొత్తులో ఉన్నందునే కొన్ని స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నామని, అందుకోసమే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని, ఫ్రీ సింబల్ అని చెప్పి జనసేన పోటీ చేయని మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించడంపై జనసేన సవాల్ చేసింది.

NDA Manifesto : టీడీపీ మ్యానిఫేస్టో అదుర్స్.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఎన్నికల ప్రణాళిక

ఎన్డీఏ మ్యానిఫేస్టో ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 18 నుంచి 59 ఏళ్ల ఉన్న మహిళలకు 1,500 రూపాయలు పింఛణు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల ఉదోగ్య భృతిని అందచేస్తామని తెలిపారు.

Hyderabad : ట్యాంకర్ల కోసం క్యూ.. ఒక్కొక్క ట్యాంకర్ కు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?

హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ఎద్దడి తలెత్తింది. భూగర్భజలాలు ఎండిపోయాయి. బోర్లు పనిచేయడం లేదు. తాగునీరు కూడా తగినంత జలమండలి అధికారులు విడుదల చేయడంలేదు. గతంలో రోజు మార్చి రోజు తాగు నీటిని విడుదల చేసేవారు. అయితే దాదాపు రెండు గంటల సేపు నీటిని విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు గంట కూడా తాగు నీటిని విడుదల చేయడం లేదు.

Congress : కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందా... ఓవర్ ఆల్ గా అంతేనా? దీనికి బాధ్యులు ఎవరు?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదన్న వార్తలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా కరువు, కరెంట్ వంటి సమస్యలు దాని మెడకు చుట్టుకునేలా ఉన్నాయన్న నివేదికలతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొంత ఇబ్బంది పడుతుంది. లోక్ సభ ఎన్నికలను పీసీసీ చీఫ్ గా, తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Encounter : కొనసాగుతున్న ఆపరేషన్ సాగర్.. ఏడుగురు మావోల మృతి

ఛత్తీస్‌గడ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మహరాష్ట్ర -నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలిలో భారీగా ఆయుధాలను భద్రతాదళాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సాగర్ పేరుతో గత కొద్ది రోజులుగా ఛత్తీస్‌గడ్ లో వరస ఎన్‌కౌంట్లు జరుగుతున్నాయి.

Mudragada : నాపేరు పద్మనాభం కాదు.. పద్మనాభరెడ్డి

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఇది తధ్యమని ఆయన అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tenth Results : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో...బాలికలే ఫస్ట్

పదోతరగతి పరీక్షల్లో బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణలోని 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. 3,927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయిని తెలిపారు. బాలుర ఉత్తీర్ణత శాతం 89.42 శాతంకాగా, బాలికల ఉత్తీర్ణత శాతం మాత్రం 93.23 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Ap Elections : గాజుగ్లాసు విజయాన్ని ఏ మాత్రం దెబ్బతీస్తుంది... నిజంగా అదే జరిగితే.. ఎన్ని నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ అంటే?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంచనాలు అటు ఇటు మారుతున్నాయి. కూటమి బలంగా కొన్ని రోజులు కనిపిస్తుంటే.. మరొకవైపు వైసీపీ కూడా రెండోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంది. అలా గెలుపుపై అంచనాలు మాత్రం అందడం లేదు. తెలంగాణలో ముందుగానే ఎన్నికల ఫలితాలు అర్థమయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అంచనాలకు ఎవరికీ అందని విధంగా ఉంది.

IPL 2024 : ఇంత వన్ సైడ్ మ్యాచ్ ఈ ఐపీఎల్ లో ఈ మధ్యకాలంలో చూడలేదు

ఐపీఎల్ లో కొన్ని జట్లు తొలి నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ తమ ఆధిపత్యాన్ని ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ లో ప్రదర్శిస్తూనే వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఒకటో రెండో ఓటములు ఎదురయినా ఇప్పటి వరకూ అయితే ఈ రెండు జట్లు దాదాపు ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు దాదాపు రెడీ అయిపోయాయి.

కన్నకొడుకులు వదిలేశారని యావదాస్తినీ ఆ తండ్రి ఏం చేశారో తెలుసా?

వృద్ధాప్యంలో కన్నకొడుకులు వదిలేశారు. కనీసం అన్నం కూడా పెట్టడం లేదు. దీంతో ఆ వృద్ధుడు తన ఆస్తిని కొండగట్టు ఆంజనేయస్వామికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లా కోడూరు మండలం అలీపూర్ కు చెందిన బాలయ్య అనే వ్యక్తికి కన్న కొడుకులు అన్నం పెట్టకుండా హింసిస్తున్నారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. తన ఆస్తిని అనుభవిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్న కన్న కొడుకులపై ఆ తండ్రికి ఎక్కడలేనీ కోపమొచ్చింది.



Tags:    

Similar News