టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
లోపలికి తోసేస్తారు అంతే.. రోజూ రాగి పాత్రలో నీరు తాగితే, ఒక్క రోజులో ఇన్ని కేసులా.. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన జగన్
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Hyderabad : తూలారో.. లోపలికి తోసేస్తారు అంతే.. పోలీసుల వార్నింగ్
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు హైదరాబాద్‌లో అనేక ఆంక్షలు విధించారు. పోలీసులు ప్రతి చోటా నిఘా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని విధాలుగా ముందస్తు ఆంక్షలను విధించారు. ఎవరైనా పరిమితికి మద్యం తాగి బయటకు వస్తే లోపల వేయడానికి సిద్ధమవుతున్నారు.
XPOSAT Mission : నూతన ఏడాది తొలిరోజు PSLV-C58 ప్రయోగం
రేపు PSLV-C58 ప్రయోగం జరగనుంది. శ్రీహరికోటలోని ఇస్రో ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది. PSLV-C58 రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా 'ఎక్స్ పోశాట్' ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందుకోసం కౌంట్ డౌన్ ను ప్రారంభించారు.
రోజూ రాగి పాత్రలో నీరు తాగితే ప్రయోజనాలేంటి? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
రాగి పాత్ర నుండి నీరు తాగడం అనేది జనాదరణ పొందుతున్న కాలానుగుణమైన పద్ధతి. రాగి పాత్రలో నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పురాతన కాలం నుంచి ఆయుర్వేదం చెబుతూ వస్తోంది. రాగి గ్లాస్‌లో ప్రతి రోజు నీరు తాగడం వల్ల పలు వ్యాధులను తరిమికొట్టవచ్చని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది.
Rajamouli - Prabhas : ఆ రికార్డులో రాజమౌళి, ప్రభాస్‌కు రెండు స్థానాలు..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' థియేటర్స్ లోకి వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఫస్ట్ డేనే రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించిన ఈ సినిమా..
Corona Virus : వామ్మో ఒక్క రోజులో ఇన్ని కేసులా.. ఇలాగయితే ఇక కష్టమే
కరోనా వైరస్ కేసులు దేశంలో ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు.
ఇలాంటి ట్రాఫిక్ చలాన్ SMS మీ మొబైల్‌కు వచ్చిందా? జాగ్రత్త
నేటి డిజిటల్ యుగంలో మోసగాళ్ళు వ్యక్తుల వలె నటించడానికి అనేక రహస్య మార్గాలను కనుగొన్నారు. మోసగాళ్లు అమాయకులకు నకిలీ చలాన్ సందేశాలు పంపుతున్నారు. ఈ నకిలీ SMS చెల్లింపు చేయడానికి లింక్‌ను కలిగి ఉంది. మీరు కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, మీకు ఈ రకమైన చలాన్ సందేశం వచ్చినట్లు భావిస్తే మీరు మోసపోవడం ఖాయం. దీని కోసం మీరు కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించాలి.
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వైఎస్ జగన్ తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
BJP : బీజేపీలో పోరు... ఆరంభం.. నిజంగా వీరి మాట పార్టీ అధినాయకత్వం వింటుందా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీలో కొందరు టీడీపీతో పొత్తును కోరుకుంటుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ రెండు గ్రూపులు ఏపీలో ఉన్నాయి.
2023 Rewind : ఈ ఏడాది BGMతో మరో రేంజ్‌కి వెళ్లిన సినిమాలు ఇవే..
ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాల్లో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు అయితే ఆ మ్యూజిక్ వలనే హిట్ అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఈ ఏడాది BGMతో మరో రేంజ్‌కి వెళ్లిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
Russia and Ukraine War : విరుచుకుపడిన ఉక్రెయిన్.. 14 మంది మృతి
రష్యా - ఉక్రెయిన్ వార్ కొన్ని నెలలుగా జరుగుతుంది. కానీ ఒక దేశంపై మరొక దేశం ఆధిపత్యాన్ని సాధించలేకపోతున్నాయి. చిన్న దేశమైన ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా కల ఇంత వరకూ నెరవేరలేదు. రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతగా తిప్పి కొడుతుంది.