టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

మోదీ చేసిన సాహసం....జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నిక, ఆమిర్ కూతురు పెళ్లి చూశారా..

Update: 2024-01-04 13:00 GMT

latest top 10 telugu news

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

ఆప్ఘనిస్తాన్ లో మరోసారి భూకంపం

ఆప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. వారంలో ఇది మూడోసారి భూంకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3 గా నమోదయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకూ ఎంత ఆస్తి నష్టం? ప్రాణ నష్టం జరిగిందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Aamir Khan : ఆమిర్ కూతురు పెళ్లి చూశారా.. ఇదెక్కడి ఆచారంరా బాబు..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్‌ వివాహం అయ్యిపోయింది. కూతురు ప్రేమించిన వాడితోనే ఆమిర్ ఆమె వివాహం జరిపించారు. తన ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ఐరా ఖాన్‌ ప్రేమలో పడింది. ఇక వీరి ప్రేమని అంగీకరించిన ఆమిర్.. 2022 నవంబర్ 18న ఇద్దరికీ నిశ్చితార్థం చేశారు. తాజాగా పెళ్లి తతంగం కూడా పూర్తి చేసేశారు.

Ys Sharmila : హస్తం కండువా కప్పేసుకున్న వైఎస్ తనయ

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తెలంగాణలో తాను స్థాపించిన వైఎస్సార్టీపిని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెను పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Honey Benefits: చలికాలంలో తేనె తింటే ఎన్నో ప్రయోజనాలు

తేనె రుచికరమైన సహజ స్వీటెనర్ మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. శతాబ్దాలుగా అనేక గృహాలలో తేనె ప్రధానమైనది. సహజ స్వీటెనర్‌గా మాత్రమే కాకుండా దానిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. అయితే ఈ ప్రయోజనాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ప్రత్యేక రకం తేనె ఉందని మీకు తెలుసా? తేనె, ఔషధ గుణాలు కలిగిన నిర్దిష్ట పుష్పించే మొక్కల తేనెను తినే తేనెటీగలచే తయారు చేయబడుతుంది.

పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. ఆ గడువు మే 31 వరకు పొడిగింపు

అధిక పెన్షన్‌ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాల్ని యాజమాన్యాలు అప్‌లోడ్‌ చేయడానికి ఈపీఎఫ్‌వో మే 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఇచ్చిన ఈ గడువు డిసెంబర్‌ 31తో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది

Ys Jagan, KTR : కలయిక పరామర్శకే కాదట... పరమార్థం వేరే ఉందట

ఇద్దరు మిత్రులు కలిశారు. ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన జగన్ కు కేటీఆర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కేటీఆర్‌తో ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత డీలా పడిన కేసీఆర్ కు భుజం తట్టి ధైర్యం చెప్పినట్లు ఆ ఫొటోలు చూస్తేనే కనిపిస్తుంది.

బైజూస్ లో ఉద్యోగాలు

బైజూస్ సంస్థ ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధమైంది. BYJU సంస్థలో పాన్ ఇండియా లొకేషన్‌లో పని చేయడానికి ఉద్యోగుల కోసం ఓపెనింగ్స్ ను ఇచ్చింది. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు పలు సబ్జెక్టులను నేర్పించాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్, టెక్-ఆధారిత వాతావరణంలో విద్యార్థులకు సహాయం చేయడానికి, మెరుగ్గా నేర్చుకునేలా చేయడానికి ఉత్సాహభరితమైన, సమర్థులైన నిపుణుల కోసం బైజూస్ సంస్థ వెతుకుతూ ఉంది.

గెలిచిన భారత్.. ఇప్పుడు తిట్టగలరా?

భారత్ లో టెస్ట్ మ్యాచ్ జరిగిందంటే.. మూడో రోజు కానీ.. నాలుగోరోజు కానీ స్పిన్ కు అనుకూలించి ఒకే రోజు ఎక్కువ వికెట్లు పడితే భారత్ లోని పిచ్ లను తిట్టడానికి ఓ వర్గం రెడీగా ఉంటుంది. స్పిన్ పిచ్ లను తయారు చేసుకుని భారత్ గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని.. అందుకే ఆ జట్టుకు స్వదేశంలో ఎక్కువ విజయాలు అంటూ చెబుతూ నోటికి పని చెబుతూ ఉంటారు.

Telangana : జనవరి 29న ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ షెడ్యూల్ విడదలయింది. బీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలగా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. దీంతో వీరిద్దరూ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ షెడ్యూల్ విడుదలయింది.


‍‍Narendra Modi : మోదీ చేసిన సాహసం చూశారా...? మీరూ ఇక్కడకు వచ్చేయండి అంటూ

నరేంద్ర మోదీ ఎప్పుడు ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. ఆయన పెద్దవాళ్లలో పెద్దవాడిగా.. చిన్నోళ్లలో చిన్న పిల్లవాడిగా కనిపిస్తారు. పదేళ్ల నుంచి ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీ తన విదేశాల పర్యటనలోనైనా, స్వదేశంలో వివిధ రాష్ట్రాలను పర్యటించినప్పుడైనా అక్కడి అందాలను చూసి ముగ్దులవుతారు.


Tags:    

Similar News