4August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

కేదార్‌నాధ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాత్రికులు అనేక మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఆర్మీ రక్షించారు. దాదాపు పదివేల మంది యాత్రికులను కాపాడినట్లు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి.

Update: 2024-08-04 12:47 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

కేదార్‌నాధ్ లో తెలుగుయాత్రికులు.. పన్నెండు మందిని రక్షించిన సిబ్బంది

కేదార్‌నాధ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాత్రికులు అనేక మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఆర్మీ రక్షించారు. దాదాపు పదివేల మంది యాత్రికులను కాపాడినట్లు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో కేదార్‌నాధ్ యాత్రను నిలిపి వేశారు.

Dengue : హైదరాబాద్ కు "డెంగీ" ఫీవర్.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు

సీజన్ మారింది. దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో డెంగీ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ఎనిమిది వందలకు పైగా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటాయన్నది అంచనా.

Chandrababu : చంద్రబాబు గతంలో లాగా కాదు.. ఇప్పుడు పూర్తిగా ఫిక్సయ్యారు..పార్టీ భవిష్యత్ కోసం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతంలో మాదిరి కాదు. పూర్తిగా మారిపోయారు. గతం కంటే భిన్నంగా ఆయన కనిపిస్తున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే. పార్టీకి మరింత జీవిత కాలం ప్రసాదించడం. తన రాజకీయ వ్యూహాలు వారసులకు వంటబడతాయో లేదో తెలియని పరిస్థితుల్లో ఆయన ఈసారి మాత్రం కొంత ఆచితూచి అడుగులేస్తున్నారు.

ఈనెల 21న భారత్ బంద్

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాలు భారత్ కు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చని తీర్పు చెప్పడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ వాదిస్తున్నారు.

కేబుల్ బ్రిడ్జిపై అదుపుతప్పిన బైక్ .. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మరణించారు. కేబుల్ బ్రిడ్జిపై బైక్ పై వస్తూ డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. వీరు గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్ , బాలప్రసన్నగా పోలీసులు చెబుతున్నారు.

సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువు తనిఖీలు నిర్వహించారు. తీవ్రవాద సంస్థ అల్ ఖైదా పేరుతో సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది.

Breaking : విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. కోర్బా - విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా - విశాఖ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. బోగీలు తగలబడిపోయాయి. బీ2. బీ7 ఎం1 బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. రైల్వే స్టేషన్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి వేస్తున్నారు.

ప్రజావాణిపై నేడు మల్లు భట్టి విక్రమార్క సమీక్ష

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రజావాణిపై సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఎన్ని వచ్చాయి? ఏ రకమైన సమస్యలు వచ్చాయి? వాటికి ఎలా పరిష్కారం కనుగొన్నారన్న దానిపై అధికారులతో చర్చించనున్నారు.

Revanth Reddy : నేడు ఎన్ఆర్ఐలతో న్యూయార్క్‌లో రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. ఆయనకు న్యూయార్క్ లో పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. పది రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణలో పెట్టుబడులను సాధించే లక్ష్యంతో అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించనున్నారు.

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. యాభై మందికి పైగా మృతి

ఉత్తరభారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన వర్షాలకు ఇప్పటివరకూ యాభై మంది వరకూ మరణించి ఉంటారని తెలిసింది. ఇంకా అనేక మంది గల్లంతయినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ లోని కులు, మండి, సిమ్లాలలో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి.

Tags:    

Similar News