టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
రైలులో చెలరేగిన మంటలు, గ్యాస్ కస్టమర్లకు ఉచిత రూ.50 లక్షల బీమా..గ్యాంగ్‌స్టర్ శరద్ మోహోల్ ఘన విజయం సాధించిన భారత్
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
ఆసీస్ మీద ఘన విజయం సాధించిన భారత్
ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌లో ఘోరమైన ఓటమిని మూట గట్టుకున్న భారత మహిళల జట్టు.. తొలి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చిత్తు చేసింది. యంగ్ పేసర్ టిటాస్ సాధు (4/17) కెరీర్ బెస్ట్ బౌలింగ్ తో రాణించగా ఆసీస్ జట్టు ఓ మోస్తరు స్కోరుకు మాత్రమే పరిమితమైంది.
ఎల్‌పీజీ గ్యాస్ కస్టమర్లకు ఉచిత రూ.50 లక్షల బీమా.. క్లెయిమ్ ఎలా చేసుకోవాలి
గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అందరికీ ఉంటుంది. అయితే కనెక్షన్ తీసుకున్నవారు కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశంలో అప్పుడప్పుడు గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరగడం చూస్తుంటాము. సిలిండర్ పేలుడు కారణంగా ఎన్నో కుటుంబాలు బుగ్గిపాలవుతున్నాయి
Sharad Mohol: గ్యాంగ్‌స్టర్ శరద్ మోహోల్ దారుణ హత్య.. చంపింది ఎవరంటే?
పూణేకు చెందిన గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ ను దారుణంగా చంపేశారు. సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు, 40 సంవత్సరాల వయస్సు గల మోహోల్‌పై ముగ్గురు నుండి నలుగురు దుండగులు మెరుపుదాడి చేశారని, వారు అతనిపై సమీపం నుండి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఒక బుల్లెట్ అతని ఛాతీని తాకగా, మరో రెండు బుల్లెట్లు అతని కుడి భుజానికి తగిలాయి.
Sankranti: నెల రోజుల ముందే హడావుడి.. మూడు రోజుల పండగ.. అదే సంక్రాంతి ప్రత్యేకత
నికి అర్థం చెప్పే పండుగ. తెలుగువారికి పెద్ద పండగ.. ఎక్కడున్నా అందరూ ఒక్క చోటికి చేరి చేసుకునే పండుగ.. సంక్రాంతి పండుగ. సందడిని తెస్తూ… అంబరాన్నంటే విధంగా సంబరాలు చేసుకోమని చెప్పే పండుగ సంక్రాంతి. పంటతల్లి ఇంటికొచ్చే పండుగ.. పదిమంది పంచుకునే ఫలితం.
Ambati Rayudu: వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చిన అంబటి రాయుడు
వైసీపీలో చేరిక సందర్భంగా మీడియాతో రాయుడు మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానిని అన్నారు. సీఎం జగన్ అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడు బరిలో దిగుతారని వార్తలు వినిపించాయి.
Health Tips: ఈ కూరగాయలను రాత్రి భోజనంలో తినకూడదు..ఎందుకో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సిఫార్స్ చేస్తుంటారు. ఈ రోజుల్లో రకరకాల వైరస్‌లు వెంటాడుతున్నాయి. దీని వల్ల చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం
Hyderabad: నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
హైదరాబాద్ లోని నారాయణ కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మల్లంపేట్ ORR బ్రాంచ్ గర్ల్స్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఏకంగా 250 విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహారం వండడంలో నాణ్యత లోపించిందని విద్యార్ధినిలు ఆరోపిస్తున్నారు.
అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది.
Aditya-L1: తుదికక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్ -1
ఆదిత్య ఎల్-1 తుది కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఆదిత్య ఎల్ -1 విజయవంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశించి మరో మైలు రాయిని అందుకుందన్నారు. అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రను సాధించడంలో భారత శాస్త్రవేత్తుల అచంచలమైన అకింతభావాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.
రైలులో చెలరేగిన మంటలు.. 5 మంది సజీవ దహనం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. నాలుగు కోచ్‌లు మంటలకు ఆహుతి అయ్యాయి. ఐదురుగురు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని పోలీసు కమాండర్ అల్ మోయిన్ తెలిపారు. ఢాకాలోని ప్రధాన రైల్వే టెర్మినల్ గోపీబాగ్ వద్ద రైలులో మంటలు చెలరేగారు.