టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
రిలీజ్‌కి ముందే గుంటూరు కారం రికార్డు కలెక్షన్స్,పోటీ ఖాయమట.. దెబ్బతీయడమే లక్ష్యం.. ,ఓహో... అందుకా రాయుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పింది
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Ambati Rayudu : ఓహో... అందుకా రాయుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పింది
అంబటి రాయుడు తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దుబాయ్ వేదికగా జరగనున్న ఐఎల్ టీ 20లో ఆయన ఆడబోతున్నట్లు ప్రకటించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ 20లో అంబటి రాయుడుకు చోటు దక్కింది. అంబటి రాయుడు ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు.
Kesineni Nani : పోటీ ఖాయమట.. దెబ్బతీయడమే లక్ష్యం.. తాను నిలబడి వారిని ఓడించడమే?
Kesineni Nani:విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలో ఉండేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు.
Holidays : పది రోజులు సంక్రాంతి సెలవులు.. ఉత్వర్వుల విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు ఈ నెల 9వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం పది రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
Budget: ప్రతి బడ్జెట్‌లో సంప్రదాయాన్ని మార్చిన నిర్మలమ్మ.. ఈ రికార్డ్‌లే ఆమె సొంతం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు భారతదేశ చరిత్రలో రికార్డ్ సృష్టిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఏదో ఒక పాత సంప్రదాయాన్ని మార్చి కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించడం లేదా సరికొత్త రికార్డును నెలకొల్పడం మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు.
Ambati Rambabu : ఇద్దరు కలిసినా చేసేదేమీ లేదు.. చంద్రబాబు, పవన్ పై ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రా కదిలిరా అన్నా కూడా ఎవరూ కదలి రారని ఆయన ఎద్దేవా చేశారు. పంటల సాగుకకు నీటిని విడుదల చేస్తున్నామన్న అంబటి రాంబాబు మూడు విడతలుగా పదిహేను టీఎంసీల నీటిని విడుదల చేశామని చెప్పారు.
కేవలం రూ.100 రైల్వే రిటైరింగ్ రూమ్.. ఇండియన్ రైల్వే సరికొత్త సదుపాయం
భారతీయ రైల్వే ప్రయాణీకులకు రిటైరింగ్ రూమ్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ సదుపాయాన్ని IRCTC అందించింది. దీనిని ఎవరైనా ప్రయాణీకులు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణీకుల రైలు ఆలస్యమైతే లేదా కొన్ని గంటల తర్వాత అతను మరొక రైలు ఎక్కవలసి వస్తే, అతనికి రిటైరింగ్ గది ఉపయోగపడుతుంది. ఈ సదుపాయంతో ప్రయాణీకులు అక్కడ అత్యుత్తమ సౌకర్యాలను పొందుతారు.
Ayodhya : అయోధ్యకు హైదరాబాద్ నుంచి కాలినడకన బయలుదేరి.. రాముల వారికి బంగారు పాదుకలు తీసుకుని
Ayodhya Ram Mandir:దేశంలో రామాలయం లేని ఊరు ఉండదు. రాముడు అంటే అందరికీ దేవుడు. హిందువులు ప్రధానంగా ఆరాధించే రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ నెల22వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అందుకోసం దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అయోధ్య రాముడిని ఒక్కసారి దర్శించుకోవాలని అందరూ కోరుకుంటారు.
Guntur Kaaram : రిలీజ్‌కి ముందే గుంటూరు కారం రికార్డు కలెక్షన్స్..
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
Tiger : నిజంగానే పులి అందుకే మరణించిందా? దర్యాప్తులో తేలిందేమిటంటే?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగజ్‌నగర్ మండలం దరిగాం అటవీప్రాంతంలో పులి మృతి చెందడాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అటవీ శాఖ అధికారులు పుల మృతి పై దర్యాప్తు చేస్తున్నారు.
కల్యాణదుర్గంలో ఎలుగుబంటి కలకలం
కల్యాణదుర్గంలో ఎలుగుబంటి సంచరిస్తుండటం కలకలం రేపుతుంది. ఎలుగుబంటిని చూసిన ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. కల్యాణదుర్గంలోని కోటవీధిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎలుగుబంటి సంచాారాన్ని చూసిన గ్రామస్థులు కొందరు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.