టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
Vyuham : ఆర్జీవీ ‘వ్యూహం’ రిలీజ్‌కి లైన్ క్లియర్.. విడుదల ఎప్పుడంటే..?, ఎవుడ్రావీడు.. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు... రెరా స్టార్ అంటూ నెట్టింట కామెంట్స్, తొలిరోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్సీ
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Shiva Balakrishna : ఎవుడ్రావీడు.. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు... రెరా స్టార్ అంటూ నెట్టింట కామెంట్స్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ గురయ్యారు. ఒక అధికారి ఇన్ని ఆస్తులు సంపాదించడం సాధ్యమా? అన్న అనుమానాన్ని మనోడు పటాపంచాలు చేసి అవతల పారేశాడు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్ గా, రెరా డైరెక్టర్ గా క్యాష్ కొట్టు అనుమతి పట్టు అన్న తరహాలో పర్మిషన్లు ఇచ్చిపడేశాడు.
Vyuham : ఆర్జీవీ ‘వ్యూహం’ రిలీజ్‌కి లైన్ క్లియర్.. విడుదల ఎప్పుడంటే..?
Vyooham : రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా రిలీజ్ కి గత కొన్నిరోజులుగా ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయని కోర్టులో కేసు వేయడంతో రిలీజ్ కి స్టే పడింది.
Yatra 2 : యాత్ర 2 సినిమాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్యారెక్టర్ .. అదిరిందంటూ?
యాత్ర 2 సినిమా విడుదలయింది. అయితే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ అభిమానులతో థియేటర్లు నిండిపోతున్నాయి. అయితే సినిమాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో అరటి తోటలను ధ్వంసం చేశారని నందిగం సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తొలిరోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్సీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ప్రారంభయ్యాయి. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరి వచ్చారు. ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ అసెంబ్లీకి రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు.
Pawan Kalyan : ఢిల్లీకి పవన్ కల్యాణ్.. సీట్ల సర్దుబాటుపై
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారని చెబుతున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటు పై కూడా పవన్ వారితో చర్చించే అవకాశాలున్నాయి.
Anushka Shetty : పవన్ సినిమా పక్కన పెట్టేసి అనుష్కతో మూవీ స్టార్ట్..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'హరిహర వీరమల్లు' వంటి పిరియాడికల్ మూవీ అనౌన్స్ చేసి 50 శాతం షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ మిగిలిన యాభై శాతం పూర్తి చేసుకోవడానికి ముప్పతిప్పలు పడుతుంది. అసలు షూటింగ్ కి వెళ్లడమే కష్టం అయ్యిపోయింది.
TDP : మరో సర్వే రిలీజ్... తెలుగు తమ్ముళ్ల జోష్ మామూలుగా లేదుగా
ఆంధ్రప్రదేశ్ లో మరో సర్వే సంచలనం రేపుతుంది. అయితే ఈ సర్వేలో మాత్రం టీడీపీ, జనసేన కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆజ్‌తక్, సీఓటరు నిర్వహించిన ఈ సర్వేలో అత్యధిక స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ఏపీ ఎన్నికలకు ముందు వస్తున్న సర్వేలు ఆసక్తిని రేపుతున్నాయి.
Kalvakuntla Kavitha : తెలంగాణ తల్లి విగ్రహం పోలికలు తనలా ఉంటాయా? నేను ఇక్కడి ఆడబిడ్డను కాదా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలను తామేదో ఇచ్చినట్లు చెప్పుకోవటం ఎందుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం తనలా ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారని, తాను కూడా తెలంగాణ ఆడబిడ్డనే కదా? అని ఆమె ప్రశ్నించారు.
దేవినేని ఉమ ఇంట విషాదం.. సోదరుడి మృతి
మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ రావు మరణించారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించారని దేవినేని ఉమ కుటుంబ సభ్యులు తెలిపారు.
BJP : రెండు నెలలవుతున్నా దిక్కు దివానం లేకపోయినే.. ఇలగయితే ఎలా?
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎనిమిది స్థానాల్లో గెలిచింది. ఒకరకంగా దానికి ఊహించని విజయమే. ఎంఐఎం కంటే ఎక్కువ స్థానాలు ఆ పార్టీకి వచ్చాయి. గెలుస్తారనుకున్నోళ్లు ఓడిపోయారు. ఓడిపోతారను కున్నోళ్లు గెలిచి కూర్చున్నారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ తప్పించి అందరూ దాదాపుగా కొత్త వాళ్లే.