April8-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
హైదరాబాద్ ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రత్యర్థిని చంపి ఆ హత్య వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఎస్‌ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ అలియాస్ సిద్ధూ ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే జైలుకు వెళ్లి సిద్ధూ బెయిల్ పై విడుదలయ్యాడు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Murder : హత్య చేస్తూ.. వీడియో తీసి.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసి
హైదరాబాద్ ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రత్యర్థిని చంపి ఆ హత్య వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఎస్‌ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ అలియాస్ సిద్ధూ ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే జైలుకు వెళ్లి సిద్ధూ బెయిల్ పై విడుదలయ్యాడు.
Hyderabad : హైదరాబాద్ లో నీటి ఎద్దడి.. వామ్మో.. బెంగళూరుగా మారబోతుందా ఏంది?
హైదరాబాద్ లో మంచినీటి కొరత ఏర్పడింది. నల్లాల నుంచి వచ్చే నీరు తగ్గిపోయాయి. జలాశయాలలో నీరు లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఎండలు మండిపోతుండటంతో పాటు నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో నీటి సరఫరాను సక్రమంగా చేయలేక జలమండలి అధికారులు చేతులెత్తేతస్ున్నారు.
Nara Lokesh : లోకేష్ మంగళగిరిని దాటడం లేదే.. ఎందుకిలా? లక్కు ఎలా ఉంది?
టీడీపీ యువనేత నారా లోకేష్ గత కొద్ది రోజులుగా మంగళగిరిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ మంగళగిరికే పరిమితం కావడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకూ ఆయన మంగళగిరిని వదిలి బయట నియోజకవర్గాలకు ప్రచారానికి రాలేేదు.
Narasaraopet : లోకల్.. నాన్ లోకల్.. ఎవరిది గెలుపు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయి?
నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎవరిది గెలుపు అన్నదానిపై బెట్టింగ్ లు ఇప్పటి నుంచే జోరుగా సాగుతున్నాయి. ఒకరు లోకల్.. మరొకరు నాన్ లోకల్.. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు దోబూచులాడుతుందన్నది విశ్లేషకుల అంచనా.
TDP : తంబళ్ల పల్లె లెక్క తప్పిందా..? తమ్ముళ్ల ఆవేదన మామూలుగా లేదుగా
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తంబళ్లపల్లె. ప్రస్తుతం ఇది వైసీపీ కీలక నాయకు డు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి చేతుల్లో ఉంది. అయితే. ఈ జిల్లాపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబు..
IPL 2024 : రాహుల్ శ్రమకు ఫలితం దక్కుతుందిగా... కేఎల్ ఆటతీరుకు అందరూ ఫిదానే
గుజరాత్ టైటాన్స్ మీద లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టి కృషితో జట్టుకు విజయాన్ని అందించారు. లక్నో సూపర్ జెయింట్స్ నిజంగానే జెయింట్ లాగా ఈ సీజన్ లో నిలిచింది. వరసగా విజయాలను నమోదు చేసుకుంటూ వెళుతుంది.
Breaking : కవితకు దక్కని రిలీఫ్.. తీహార్ జైలులోనే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడింది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటీషన్ విచారణ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని ఊహించిన ఆమె అభిమానులకు నిరాశ ఎదురయింది.
Volunteers : వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా... కారణం ఏం చెప్పారంటే?
నూజివీడు నియోజకవర్గంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాల పత్రాలను ఎండిఓ కి అందచేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తాము పనిచేశామని, అయితే ఎన్నికల నిబంధనల పేరుతో విధులకు దూరంగా పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆటాడుకోవడానికి కారులోకి వెళ్లి.. డోర్ లాక్ కావడంతో బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ లోని రాకాసిపేటలో బాలుడు కారులో మరణించిన సంఘటన జరిగింది. బాలుడి కుటుంబం వాచ్‌మెన్ గా పనిచేస్తూ పొట్టగడుపుకుంటుంది. అయితే ఆగివున్న కారులోకి ఆరేళ్ల బాలుడు ఎక్కి డోర్స్ ను లాక్ చేసుకున్నాడు. అయితే బాలుడు ఎక్కడున్నాడో తెలియక రెండు రోజుల నుంచి తల్లిదండ్రులు వెదుకుతున్నారు.
Breaking : జనసేనకు షాక్.. కీలక నేత రాజీనామా
విజయవాడలో జనసేనకు భారీ షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జి పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉన్న పదవులకు, ప్రాధమిక సభ్యత్వానికి కూడా పోతిన మహేష్ రాజీనామా చేశారు. ఆయన మొన్నటి వరకూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆశించారు.