9May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తమిళనాడులోని శివకాశీ బాణా సంచా తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ కుటీర పరిశ్రమలా బాణాసంచతా తయారు చేస్తుంటారు. తరచూ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయినా మాత్రం ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినపిస్తున్నాయి.

Update: 2024-05-09 13:00 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

భారీ పేలుడు.. స్పాట్ లోనే ఏడుగురు మృతి

శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తమిళనాడులోని శివకాశీ బాణా సంచా తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ కుటీర పరిశ్రమలా బాణాసంచతా తయారు చేస్తుంటారు. తరచూ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయినా మాత్రం ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినపిస్తున్నాయి.

YSRCP : డెత్ ఓవర్ లో జగన్ టీం ఏం చేయనుందో? ఇప్పటికే స్పీడ్ పెంచిన బ్లూ పార్టీ క్యాడర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని రాజకీయ పార్టీలూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు మరింత స్పీడ్ తో ఇప్పటికే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో చివరి మూడు రోజులు అత్యంత కీలకం. ఎలక్షనీరింగ్ అనేది ఈ మూడు రోజుల్లోనే జరుగుతుంది.

Hyderabad : రేపు నగరం సగం ఖాళీ అవుతున్నట్లే.. షేరింగ్ సీట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు

హైదరాబాద్ నగరం రేపు ఖాళీ కానుంది. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి సీమాంధ్రులు తమ సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ, ప్రయివేటు బస్సులను ముందుగానే బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులలో టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి.

Jana Sena : ప‌వ‌న్ ప‌ట్టుబ‌ట్టి తీసుకున్నా జ‌న‌సేన ఓడే ఫ‌స్ట్ సీటు అదే అవుతుందా..?

జ‌న‌సేన పార్టీ ప్రస్తుత ఎన్నిక‌ల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ప‌రిస్తితిని ప‌క్కన పెడితే.. 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా య‌నేది ఆస‌క్తిగా మారింది. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా ఫ‌స్ట్ ఓడిపోయే సీటు ఇదే నంటూ.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. ఈ సీటును జ‌న‌సేన‌కు ఇచ్చి టీడీపీ కూడా త‌ప్పు చేసింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Ys Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. అనుమతి ఇవ్వవద్దంటూ

విదేశాలకు వెళ్లాలన్న జగన్ పిటిషన్‍పై తీర్పు ఈనెల 14కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీబీఐ తన వాదనలను వినిపించాలని కోర్టు కోరింది. ఈరోజు జరిగిన విచారణలో సీబీఐ పిటీషన్ వేసింది.

IPL 2024 : సన్ రైజర్స్ మళ్లీ రైజ్ అయ్యారుగా... అంత స్కోరును ఊది పారేశారుగా

ఐపీఎల్ లో మజా లేకుండా కూడా కొన్ని మ్యాచ్ లు జరుగుతాయి. అందులో పెద్దగా టెన్షన్ ఉండదు. ఎందుకంటే తక్కువ స్కోరు ప్రత్యర్థి జట్టు చేయడంతో అవతలి జట్టు సులువుగా స్కోరును అధిగమించేస్తుంది. అయితే ఇది సులువుగా లభించింది కాదు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేయగలిగితే తర్వాత ఛేదనలో ఏ జట్టు అయినా టెన్షన్ లేకుండా ఆడగలుగుతుంది.

Ys Jagan : పవర్ ప్లే లో జగన్ టీం ఎక్కువ రన్స్ చేయలేకుండా కమ్ముకున్నారా?

అవును.. మొన్న అమిత్ షా ఒకసారి వచ్చి వెళ్లిన వెంటనే ఏపీ డీజీపీ బదిలీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. వాయిస్ పెంచారు. జగన్ అవినీతిపై గళమెత్తారు. ఎన్నికలకు ఇంకా ఆరు రోజులు సమయం ఉన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు అందరూ కమ్మేశారు. జగన్ ఒక్కడే అయ్యాడు.

మందుబాబులకు షాకింగ్ న్యూస్

రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో మద్యం దుకాణాలు మూడు రోజులకు పైగానే మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ జరుగుతుంది.

నేడు పద్మవిభూషణ్ అందుకోనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మవిభూషణ‌్ అవార్డును అందుకోనున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

లారీలో కరెన్సీ నోట్లు.. హైదరాబాద్ నుంచి గుంటూరుకు... పట్టుబడిన 8.9 కోట్లు

ఎన్నికల్లో నగదును పంచడానికి రాజకీయపార్టీలు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులను కూడా వదలకుండా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో లారీలో తరలించేందుకు సిద్ధపడ్డారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న 8.90 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News